Breaking News

క్రయోజనిక్‌ ఇంజిన్‌ 20 పరీక్ష సక్సెస్‌

Published on Fri, 12/13/2024 - 05:47

సూళ్లూరుపేట: సీఈ20 క్రయోజనిక్‌ ఇంజన్‌లో సంక్లిష్టమైన ప్రక్రియను దాటడం ద్వారా మళ్లీ స్టార్‌ చేయడానికి వీలుండే వ్యవస్థల అభివృద్ధిలో మరో ముందడుగు వేశామని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) గురువారం ప్రకటించింది. భవిష్యత్తు ప్రయోగాలకు ఈ పరీక్ష ఎంతగానో దోహదపడుతుందని ఇస్రో పేర్కొంది. నాజిల్‌ ఏరియా నిష్పత్తి 100 శాతం ఉండేలా సముద్ర ఉపరితల స్థాయిలో హాట్‌ టెస్ట్‌లో సీఈ20 క్రయోజనిక్‌ ఇంజన్‌ను నవంబర్‌ 29న విజయవంతంగా పరీక్షించామని ఇస్రో గురువారం వెల్లడించింది. 

తమిళనాడులోని మహేంద్రగిరిలో ఉన్న ఇస్రో వారి ప్రొపల్షన్‌ కాంప్లెక్స్‌ ఈ పరీక్షకు వేదికైంది. ఎల్వీఎం మార్క్‌–3 రకం రాకెట్‌లో పైభాగానికి తగు శక్తిని అందివ్వడంలో సీఈ20 ఇంజన్‌ సాయపడుతుంది. 19 టన్నుల థ్రస్ట్‌ను అందించే పరీక్షలో ఈ ఇంజన్‌ నెగ్గింది. ఇప్పటికే ఎల్‌వీఎం2 ఆరు ప్రయోగాల్లో ఈ ఇంజన్‌ అద్భుతంగా పనిచేసింది. ‘‘గగన్‌యాన్‌ మిషన్‌కు కావాల్సిన 20 టన్నుల థ్రస్ట్‌ స్థాయిని అందించేందకు ఈ ఇంజన్‌ అర్హత సాధించింది. 

భవిష్యత్తులో సీ32 స్టేజ్‌లో పేలోడ్‌ పరిమాణాన్ని పెంచేందుకు ఉపయోగపడే 22 టన్నుల థ్రస్ట్‌ను అందించే కార్యక్రమాల్లోనూ ఈ ఇంజన్‌ను ప్రయోగాత్మకంగా వాడొచ్చు’’అని ఇస్రో పేర్కొంది. మళ్లీ ఇంజన్‌ను రీస్టార్‌ చేసేందుకు అవసరమయ్యే బహుళధాతు ఇగ్నైటర్‌ సామర్థ్యాన్నీ విజయవంతంగా పరీక్షించారు. ‘‘సముద్రమట్టం స్థాయిలో సీ20 ఇంజన్‌కు సవాళ్లు ఎదురవుతాయి. నాజిల్‌ పెద్దదిగా ఉండటంతో 50 ఎంబార్‌ స్థాయిలో విపరీతమైన శక్తి బయటకు వెలువడుతుంది. దీంతో ఇంజన్‌ సమీపంలో అత్యంత ఉష్ణం జనించడంతోపాటు పెద్దస్థాయిలో కంపనాలు మొదలై ఆ నాజిల్‌ దెబ్బతినే ప్రమాదముంటుంది. ఈ సమస్యను అధిగమించేందుకు వినూత్న ‘నాజిల్‌ ప్రొటెక్షన్‌ సిస్టమ్‌’ను ఉపయోగించాం’’అని ఇస్రో పేర్కొంది.  
 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)