Breaking News

వికాస్‌ ఇంజిన్‌ రీస్టార్ట్‌  విజయవంతం: ఇస్రో 

Published on Sun, 01/19/2025 - 05:15

సాక్షి, బెంగళూరు: మహేంద్రగిరిలోని ప్రొపల్షన్‌ కాంప్లెక్స్‌లో శుక్రవారం వికాస్‌ లిక్విడ్‌ ఇంజిన్‌ను విజయవంతంగా రీస్టార్ట్‌ చేసినట్లు ఇస్రో తెలిపింది. రాకెట్‌ లాంఛర్లకు ద్రవీకృత ఇంధన దశల్లో వికాస్‌ ఇంజిన్‌ ఎంతో కీలకమైందని పేర్కొంది. భవిష్యత్తులో ప్రయోగించే రాకెట్‌ లాంఛర్ల పునరి్వనియోగానికి సంబంధించిన సాంకేతికతలో జనవరి 17వ తేదీని ఓ మైలురాయిగా ఓ ప్రకటనలో ఇస్రో అభివర్ణించింది. 

వివిధ పరిస్థితుల్లో విక్రమ్‌ ఇంజిన్‌ను రీస్టార్ట్‌ చేసి, పనితీరును అంచనా వేసేందుకు వరుస గా పరీక్షలు చేపట్టనున్నట్లు వివరించింది. ‘ఈ పరీక్షలో 60 సెకన్ల పాటు ఇంజిన్‌ను పనిచేయించి, 120 సెకన్ల పాటు ఆపేశాం. తిరిగి స్టార్ట్‌ చేసి ఏడు సెకన్లపాటు పనిచేయించాం. ఈ పరీక్షలో ఇంజిన్‌ మామూలుగానే పనిచేసింది. అన్ని పరామితులను ఆశించిన రీతిలో అందుకుంది’అని ఇస్రో వివరించింది. డిసెంబర్‌ 2024లో నూ ఇలాంటి పరీక్షనే విజయవంతంగా నిర్వహించామని తెలిపింది. అప్పుడు కేవలం ఏడు సెకన్లపాటే ఇంజిన్‌ను మండించి, 42 సెకన్ల వరకు ఆపేసి ఉంచామని వివరించింది. 

#

Tags : 1

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)