Breaking News

శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర.. ఇస్రో కీలక ప్రకటన

Published on Sat, 06/14/2025 - 11:54

ఢిల్లీ: భారత వ్యోమగామి శుభాంశు శుక్లా (Shubhanshu Shukla) రోదసియాత్ర ఇస్రో కొత్త తేదీని ప్రకటించింది. జూన్‌ 19వ తేదీన శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర చేపట్టనున్నారు. యాక్సియం-4 మిషన్‌ కింద మరో ముగ్గురు ఆస్ట్రోనాట్లతో కలిసి ఆయన నింగిలోకి వెళ్లనున్నారు. అయితే, తొలుత మే 29న ప్రయోగం జరగాల్సి ఉండగా.. సాంకేతిక సమస్యలతో పలుమార్లు వాయిదా పడింది. ఈ నేపథ్యంలో తాజాగా ఇస్రో కొత్త తేదీని ప్రకటించింది.

ఇదిలా ఉండగా.. అంతకుముందు శుభాంశు శుక్లా (Shubhanshu Shukla) రోదసియాత్ర వాయిదా పడిన విషయం తెలిసిందే. సాంకేతిక సమస్యతో యాత్రను వాయిదా వేస్తున్నట్లు స్పేస్‌ఎక్స్‌ తెలిపింది. రాకెట్‌లో లిక్విడ్‌ ఆక్సిజన్‌ లీక్‌ కారణంగా ప్రయోగం వాయిదా పడినట్లు ‘ఎక్స్‌’లో పేర్కొంది. మరమ్మతులకు సమయం పడుతుందని.. త్వరలోనే కొత్త లాంచ్‌ తేదీని ప్రకటిస్తామని వెల్లడించింది. ప్రయోగ వాయిదా విషయాన్ని భారత రోదసి పరిశోధన సంస్థ (ఇస్రో) కూడా ధ్రువీకరించింది. ప్రయోగానికి ముందు బూస్టర్‌ టెస్టును తనిఖీ చేస్తుండగా ఈ సమస్యను గుర్తించినట్లు తెలిపింది. తొలుత లీక్‌ సమస్యను పరిష్కరించి పరీక్షించిన తర్వాత ప్రయోగం నిర్వహించాలని శాస్త్రవేత్తలు తేల్చారు. 

అమెరికాకు చెందిన వాణిజ్య అంతరిక్ష సంస్థ ‘యాక్సియం స్పేస్’ ఈ మిషన్‌ నిర్వహిస్తోంది. ఇస్రో, అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా), ఐరోపా అంతరిక్ష సంస్థ (ఈఎస్‌ఏ)లు ఇందులో భాగస్వామ్యం వహిస్తున్నాయి. ఈ స్పేస్‌ క్యాప్సూల్‌ను ఫాల్కన్‌-9 రాకెట్‌ నింగిలోకి మోసుకెళుతోంది. ఇందులో శుభాంశు మిషన్‌ పైలట్‌ బాధ్యతలు నిర్వహిస్తారు. 

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)