‘బ్లూబర్డ్‌’ ప్రయోగానికి  ఇస్రో సన్నద్ధం 

Published on Fri, 08/08/2025 - 06:33

సూళ్లూరుపేట: బాహుబలి రాకెట్‌గా పేరు గాంచిన ఇస్రో వారి ఎల్‌వీఎం3 మార్క్‌–5 రాకెట్‌ ద్వారా 6,500 కేజీల అత్యంత బరువైన బ్లూ బర్డ్‌ వాణిజ్య ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు ఇస్రో ఏర్పాట్లను ముమ్మరం చేసింది. అమెరికాలోని టెక్సాస్‌కు చెందిన ఏఎస్‌టీ స్పేస్‌ మొబైల్‌ సంస్థ ఈ ఉపగ్రహాన్ని రూపొందించింది. షార్‌లోని రెండో వెహికల్‌ అసెంబ్లింగ్‌ బిల్డింగ్‌లో రాకెట్‌ అనుసంధానం పనులు జరుగుతున్నాయి. బ్లూబర్డ్‌ త్వరలోనే అమెరికా నుంచి భారత్‌కు చేరుకోనుంది. షార్‌ చరిత్రలో ఇది భారీ ప్రయోగమనే చెప్పాలి. 

బ్లూబర్డ్‌ ప్రత్యేకతలివీ..  
ఇది అమెరికన్‌ కమ్యూనికేషన్‌ ఉప గ్రహం. ఇద్దరు వ్యక్తులు అంతరిక్షం నుంచి స్మార్ట్‌ ఫోన్ల ద్వారా కాల్స్‌ చేసుకోవడానికి ఉపయోగపడేలా రూపొందించారు. భూమికి తక్కువ దూరంలోని లియో ఆర్బిట్‌ నుంచి పని చేసే ఈ ఉపగ్రహానికి 64 చదరపు మీటర్ల విస్తీర్ణం కలిగిన వినూత్నమైన యాంటెన్నా ఉంటుంది. ఉపగ్రహం నుంచి స్మార్ట్‌ ఫోన్‌కు ఇది ప్రత్యక్ష కనెక్టివిటీని సులభతరం చేస్తుంది. మొబైల్‌ ఫోన్‌ వినియోగదారులు భూమిపైని టవర్లపై ఆధారఫడకుండా అంతరిక్షం నుంచి కాల్స్‌ చేయడానికి, బ్రాడ్‌బ్యాండ్‌ ఇంటర్నెట్‌ను యాక్సెస్‌ చేయడానికి ఈ ఉపగ్రహం దోహపడుతుంది. బ్లూబర్డ్‌ ఉపగ్రహం కిరణాలు 40 ఎంహెచ్‌జడ్‌ వరకు సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఇది 120 ఎంబీపీఎస్‌ వరకు గరిష్ట ట్రాన్స్‌మిషన్‌ వేగాన్ని అందిస్తుంది. బ్లూబర్డ్‌ ఉపగ్రహాల సిరీస్‌ను ప్రపంచవ్యాప్తంగా ఎంపిక చేసిన మార్కెట్లలో నిరంతరాయంగా సెల్యూలార్‌ బ్రాండ్‌బ్యాండ్‌ సేవలు అందించే లక్ష్యంతో రూపకల్పన చేశారు. 
 

Videos

10 రోజులుగా శిథిలాల కింద.. చివరకు ప్రాణాలతో బయటకు..!

DSCలో స్కాం జరగకపోతే CBI విచారణకు సిద్ధమా..?

పుట్టలో పాముల్లా బయటికొస్తున్న DSC అక్రమాలు

జూడో ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగం

DSCపై లోకేష్ తో బహిరంగ చర్చకు సిద్ధం.. అభ్యర్థి సంచలన సవాల్..!

వైఎస్ జగన్ పాదయాత్ర.. తేదీ ఖరారు..!

30 వేల పెన్షన్ రావాల్సింది.. 13 వేలు ఇస్తున్నారు

మెటా తో లోకేష్ కుమ్మక్కు... సోషల్ మీడియా అకౌంట్లు బ్లాక్...

తలుపులేసుకుని తొడకొట్టే హీరో... మొత్తం గీసుకొని మీసం మెలేసే మొనగాడు..!

నడుములోతు నీళ్లలో లగ్గం.. వరదైనా తగ్గేదేలే అంటున్న జంట

Photos

+5

దేవకన్యలా 'మ్యాడ్' ఫేమ్ అనంతిక (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘రన్ ఫర్ నేచర్'(ఫొటోలు)

+5

పింక్ బ్యూటీ ప్రియాంక మోహన్ (ఫొటోలు)

+5

'మారెమ్మ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)