Breaking News

ఎలక్ట్రికల్‌ థ్రస్టర్లతో ఉపగ్రహ ప్రయోగం

Published on Sun, 10/27/2024 - 05:35

న్యూఢిల్లీ: నిర్దేశిత కక్ష్యలోకి ఉపగ్రహాలను ప్రవేశపెట్టడానికి ఎలక్ట్రికల్‌ థ్రస్టర్లను వాడనున్నట్లు ఇస్రో ఛైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ తెలిపారు. భారత్‌ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఎలక్ట్రికల్‌ ప్రొపెల్లర్లను డిసెంబరులో చేపట్టనున్న టీడీఎస్‌–01 ఉపగ్రహ ప్రయోగంలో వాడతామని వెల్లడించారు. నాలుగు టన్నుల బరువున్న సంప్రదాయ రాకెట్‌లో 2 నుంచి 2.5 టన్నుల ఇంధనం ఉంటుందని, అదే ఎలక్ట్రికల్‌ ప్రొపల్షన్‌ను వాడితే 200 కేజీల ఇంధనం సరిపోతుందని తెలిపారు.

 ఇంధన ట్యాంకు పరిమాణం తగ్గిపోతే.. దానికి అనుగుణంగా అన్నీ తగ్గుతాయని, ఉపగ్రహం రెండు టన్నుల్లోపే ఉంటుందని చెప్పారు. అయితే నాలుగు టన్నుల రాకెట్‌కు సరిపడా శక్తి ఉంటుందని వివరించారు. సాధారణంగా కెమికల్‌ థ్రస్టర్ల ద్వారా రాకెట్‌ మండించి ఉపగ్రహాన్ని ప్రయోగిస్తే.. వారం రోజుల్లో నిర్దేశిత కక్ష్యలోకి చేరుకుంటుందని, అయితే ఎలక్ట్రికల్‌ ప్రొపెల్షన్‌ను వాడితే మూడునెలల సమయం పడుతుందని తెలిపారు.  
 

Videos

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)