Breaking News

ఎన్‌జీఎల్‌వీ తయారీకి  సిద్ధమవుతున్న ఇస్రో 

Published on Fri, 01/31/2025 - 05:23

సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) భవిష్యత్తులో అతిపెద్ద ప్రయోగాలను దృష్టిలో వుంచుకుని ఒక భారీ రాకెట్‌ తయారు చేసేందుకు శ్రీకారం చుట్టింది. ఈ రాకెట్‌కు న్యూ జనరేషన్‌ లాంచింగ్‌ వెహికల్‌ (ఎన్‌జీఎల్‌వీ) అని నామకరణం కూడా చేశారు. ఇస్రో మొదటినాళ్లలో చేపట్టిన రోహిణి సౌండింగ్‌ రాకెట్‌ల ప్రయోగాల తరువాత 40 కిలోలు నుంచి 5,000 కిలోలు ఉపగ్రహాలను మోసుకెళ్లే ఎస్‌ఎల్‌వీ, ఏఏస్‌ఎల్‌వీ, పీఎస్‌ఎల్‌వీ, జీఎస్‌ఎల్‌వీ, ఎల్‌వీఎం03, ఎస్‌ఎస్‌ఎల్‌వీ అనే ఆరు రకాల రాకెట్లును అభివృద్ది చేసింది. 

భవిష్యత్తులో అంటే 2040 నాటికి మానవుడ్ని అంతరిక్షంలోకి తీసుకెళ్లి తిరిగి తీసుకొచ్చే ప్రయోగంతో పాటు చంద్రుడిపై మానవుడ్ని తీసుకెళ్లి తిరిగి తీసుకొచ్చే ప్రయోగాన్ని కూడా చేపట్టాలని ఇస్రో భావిస్తోంది. వీటితో పాటు అత్యంత బరువు కలిగిన కమ్యూనికేషన్‌ ఉపగ్రహాలను జియో ట్రాన్స్‌ఫర్‌ ఆర్బిట్‌లోకి (జీటీఓ) పంపేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చుకుంటున్నారు. 

ఈ నేపథ్యంలో న్యూ జనరేషన్‌ లాంచింగ్‌ వెహికల్‌ 20 నుంచి 30 టన్నుల బరువు కలిగిన కమ్యూనికేషన్‌ ఉపగ్రహాలను భూమికి దగ్గరగా వున్న లియో అర్బిట్‌లోకి, 10 వేలు కిలోలు బరువు కలిగిన ఉపగ్రహాలను జీటీఓ ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్ట గలిగిన సామర్థ్యాన్ని కలిగి వుంటుంది. అయితే దీనికి సంబంధించి 2008 డిసెంబర్‌ 22న రూ.1,798 కోట్లు అంచనాలతో ప్రణాళికను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. 

ఈ నిధులతో సెమీ క్రయోజనిక్‌ దశను అభివృద్ది చేయడంతో పాటు రాకెట్‌కు సంబంధించిన పరికరాలను సాంకేతికంగా రూపొందించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. ఎన్‌జీఎల్‌వీ రాకెట్‌ ప్రయోగానికి ఇప్పుడున్న ప్రయోగవేదికల సామర్థ్యం సరిపోదని మూడో ప్రయోగవేదిక నిర్మాణానికి కేంద్ర సైంటిఫిక్‌ విభాగం వారు మంత్రివర్గ సమావేశంలో రూ. 3,986 కోట్లు మంజూరు చేశారు. షార్‌ కేంద్రంలో మూడో ప్రయోగవేదిక నిర్మాణానికి స్థలం ఎంపిక కూడా జరిగింది. ప్రయోగవేదికతో పాటు ఎన్‌జీఎల్‌వీ రాకెట్‌ను కూడా రూపొందించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు సిద్దమవుతున్నారు. త్వరలోనే ప్రయోగవేదిక నిర్మాణానికి భూమిపూజ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.  

న్యూ జనరేషన్‌ లాంచింగ్‌ వెహికల్‌ (ఎన్‌జీఎల్‌వీ) వివరాలు... 
→ ఎన్‌జీఎల్‌వీ రాకెట్‌ ఎత్తు 75 మీటర్లు. 
→ రాకెట్‌ వెడల్పు 5 మీటర్లు. 
→ ప్రయోగ సమయంలో శాటిలైట్‌ లేకుండా రాకెట్‌ బరువు మాత్రమే 1,000 టన్నులు వుంటుంది. 
→ మూడు దశలతోనే రాకెట్‌ను రూపొందిస్తున్నారు. 
→ పీఎస్‌ఎల్‌వీ ఎక్స్‌ల్‌ తరహాలో ఎన్‌జీఎల్‌వీ రాకెట్‌కు ఆరు స్ట్రాపాన్‌ బూస్టర్లు కలిగి వుంటుంది. 
→ కోర్‌ అలోన్‌ దశలో 160 టన్నుల సెమీ–క్రయోజనిక్‌ ఇంధనాన్ని వినియోగిస్తారు. 
→ క్రయోజనిక్‌ దశలో 30 టన్నుల క్రయో ఇంధనాన్ని వినియోగిస్తారు.  
→ ఈ రాకెట్‌ రూపాంతరం చెందితే నాసాకి చెందిన పాల్కన్‌ రాకెట్, అట్లాస్‌–వీ, ప్రోటాన్‌–ఎం, లాంగ్‌ మార్చ్‌ –58 రాకెట్‌ల స్థాయికి ఏమాత్రం తగ్గకుండా వుంటుంది. 
→ ఇస్రో మాజీ చైర్మన్‌ డాక్టర్‌ ఎస్‌.సోమనాథ్‌ 2023 డిసెంబర్‌లోనే దీనిపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ కూడా ఇచ్చారు. 2030 , 2035 నాటికి మాన వ అంతరిక్ష యానం, లోతైన అంతరిక్ష యాత్రలు, అత్యంత బరువైన కమ్యూనికేషన్‌ ఉపగ్రహాల ప్రయోగాలు చేసేందుకు వీలుగా ఈ రాకెట్‌ను రూపొందిస్తున్నట్టుగా పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌లో వివరించారు. ఎన్‌జీఎల్‌వీ రాకెట్‌ గురించి దశల వారీగా కూడా ఆయన వివరించి మరీ చెప్పారు.  
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)