Breaking News

గాజాపై ఇజ్రాయెల్ దాడి.. 36 మంది మృతి

Published on Sun, 08/25/2024 - 10:21

ఇజ్రాయెల్ సైన్యం దక్షిణ గాజాపై వరుస దాడులకు తెగబడుతూనే ఉంది. తాజాగా దక్షిణ గాజాపై ఇజ్రాయెల్‌ జరిపిన దాడిలో 36 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. గాజా పూర్తిగా ధ్వంసం  అయినప్పటికీ, ఇజ్రాయెల్ సైన్యం తన దాడులను ఇంకా ఆపడం లేదు.  

తాజాగా ఇజ్రాయెల్ దక్షిణ గాజా స్ట్రిప్‌లో ఏకకాలంలో పలు వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో 36 మందికిపైగా పాలస్తీనియన్లు మృతిచెందారు. గాజా ఆరోగ్య శాఖ అధికారులు ఈ ఘటనకు సంబంధించిన వివరాలను మీడియాకు తెలిపారు. ఇజ్రాయెల్ వైమానిక దాడిలో ఖాన్ యూనిస్ నగరంలో ఇద్దరు పిల్లలతో సహా ఒక కుటుంబంలోని 11 మంది సభ్యులు మృతిచెందారని నాసర్ ఆస్పత్రి అధికారులు తెలిపారు. ఖాన్ యునిస్‌తో పాటు ఆ పరిసర ప్రాంతాల్లో మూడు వేర్వేరు దాడుల్లో 33 మంది  మృతిచెందారని, వారి మృతదేహాలను ఆసుపత్రికి తీసుకువచ్చారని తెలిపారు.

ఖాన్ యూనిస్‌కు దక్షిణంగా ఉన్న రహదారిపై జరిగిన దాడిలో మరో పదిహేడు మంది మృతిచెందారని నాసర్ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. 2023, అక్టోబర్‌ 7న గాజాలో యుద్ధం ప్రారంభమైంది. హమాస్‌తో పాటు మిలిటెంట్లు ఇజ్రాయెల్‌పై ఆకస్మిక దాడి చేశారు. ఈ దాడిలో దాదాపు 1,200 మంది ఇజ్రాయెల్‌ పౌరులు మృతిచెందారు. నాటి నుంచి ఇజ్రాయెల్‌ ప్రతీకారదాడులు చేస్తూ వస్తోంది.

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)