Breaking News

రైలు టికెట్ల బుకింగ్‌ మరింత సులువు

Published on Thu, 07/16/2026 - 06:30

న్యూఢిల్లీ: దాదాపు 20 ఏళ్ల తర్వాత  సరికొత్త డిజైన్, అధునాతన ఫీచర్లతో ఐఆర్‌సీటీసీ(ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌) తన టికెట్‌ బుకింగ్‌ వెబ్‌సైట్‌ను రూపొందించింది. ఇందుకు సంబంధించిన బీటా వెర్షన్‌ ఈ నెల 15 నుంచి వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. ఈ కొత్త వెబ్‌సైట్‌లో ప్రయాణికులకు సులభంగా, వేగంగా టికెట్‌ బుక్‌ చేసుకునేందుకు వీలవుతుంది. ఇందుకుగాను రైల్వే శాఖ నాలుగు ముఖ్యమైన మార్పులను తీసుకువచ్చింది. ఇందులో ప్రకటనలు, అనవసరపు క్యాప్చాలు లేవు. 

టికెట్‌ బుక్‌ చేసేటప్పుడు స్క్రీన్‌పై వచ్చే అనవసరపు పాప్‌–అప్‌లు, మిరుమిట్లు గొలిపే గ్రాఫిక్స్‌ ప్రకటనలు, ఇబ్బంది పెట్టే క్యాప్చాలను పూర్తిగా తొలగించింది. దీనివల్ల ప్రయాణికులు ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రశాంతంగా టికెట్లు బుక్‌ చేసుకోవచ్చు. ముఖ్యంగా తత్కాల్‌ బుకింగ్‌ సమయంలో ఇది ఎంతో సహాయపడుతుంది. అన్ని తరగతుల సీట్ల లభ్యత ఒకే స్క్రీన్‌పై కనిపిస్తున్నాయి. రెగ్యులర్‌గా ప్రయాణించే వారి వివరాలు వెబ్‌సైట్‌లో ఆటోమేటిక్‌గా సేవ్‌ అవుతాయి. కొత్తగా అప్‌గ్రేడ్‌ చేసిన ప్యాసింజర్‌ రిజర్వేషన్‌ సిస్టమ్‌ (పీఆర్‌ఎస్‌) ద్వారా నిమిషానికి 1.5 లక్షల కంటే ఎక్కువ టికెట్లను బుక్‌ చేసుకోవచ్చు. బీటా వెర్షన్‌ను ఐఆర్‌సీటీసీ ఇ–టికెటింగ్‌ పోర్టల్‌ ద్వారా లేదా ప్రస్తుత ఐఆర్‌సీటీసీ హోమ్‌పేజీలో ఉన్న లింక్‌తో యాక్సెస్‌ చేయవచ్చు.

Videos

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)