Breaking News

ప్రధాని మోదీ ప్రస్తావించిన డీజీపీ రష్మీశుక్లా ఎవరు?

Published on Sat, 08/31/2024 - 07:44

ముంబై: మహారాష్ట్ర తొలి మహిళా డీజీపీ మరోసారి వార్తల్లో నిలిచారు. ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రసంగంలో ఆమె గురించి ప్రస్తావించారు. మహారాష్ట్రలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ రాష్ట్రంలో తొలిసారిగా మహిళా డీజీపీ (డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్) పోలీసులను ముందుకు నడిపిస్తున్నారని అన్నారు. మహారాష్ట్ర తొలి మహిళా డీజీపీగా ఎంపికైన ఈ మహిళా ఐపీఎస్ ఎవరో తెలుసుకుందాం.

మహారాష్ట్ర తొలి మహిళా డీజీపీ పేరు రష్మీ శుక్లా. ఆమె 1988 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. 2024 జనవరి 4న మహారాష్ట్ర నూతన డీజీపీగా నియమితులయ్యారు.  అంతకుముందు ఆమె డిప్యూటేషన్‌పై సశాస్త్ర సీమా బల్ (ఎస్‌ఎస్‌బీ) డైరెక్టర్ జనరల్ (డీజీ)గా  పనిచేశారు. ఐపీఎస్‌ అధికారి, డీజీపీ రజనీష్ సేథ్ 2023, డిసెంబర్‌ 31న పదవీ విరమణ చేశారు. ఆ తర్వాత ముంబై పోలీస్ కమిషనర్ వివేక్ ఫన్సాల్కర్‌కు డీజీపీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం 2024,జనవరి 4న నూతన డీజీపీగా రష్మీ శుక్లాను నియమించింది.

మహారాష్ట్ర డీజీపీ రష్మీ శుక్లా రాష్ట్రంలో సీనియర్ ఐపీఎస్ అధికారి. మూడేళ్లపాటు ఆమె కేంద్రంలో డిప్యూటేషన్‌పై కొనసాగారు. ఆమె గత జూన్‌లో పదవీ విరమణ చేయవలసి ఉంది. అయితే ఆమె పదవీ కాలాన్ని ప్రభుత్వం పొడిగించింది. రష్మీ శుక్లా ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు చెందినవారు. ప్రయాగ్‌రాజ్‌లోనే తన చదువును పూర్తి చేశాడు. అక్కడే పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ చేశారు. 24 ఏళ్లకే ఐపీఎస్‌గా ఎంపికయ్యారు. రష్మీ శుక్లా.. ఉదయ్ శుక్లాను వివాహం చేసుకున్నారు. ఉదయ్ ప్రస్తుతం ముంబైలోని ఆర్పీఎఫ్‌లో విధులు నిర్వహిస్తున్నారు.

ఐపీఎస్ రష్మీ శుక్లా నాగ్‌పూర్ రూరల్ పోలీస్ సూపరింటెండెంట్‌గా కూడా పనిచేశారు. సౌత్ సెంట్రల్ జోన్ కల్చరల్ సెంటర్ డైరెక్టర్‌గా, పూణే పోలీస్ కమిషనర్ కూడా విధులు నిర్వహించారు. గతంలో ఆమె రాజకీయ నాయకుల ఫోన్లను ట్యాప్ చేశారంటూ పలు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపధ్యంలో ఆమెపై పూణె, ముంబైలలో కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వం మారిన దరిమిలా ఆమెపై పెట్టిన కేసులను ఉపసంహరిస్తూ, క్లీన్ చిట్ ఇచ్చారు.

Videos

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినానో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)