Breaking News

ఐఏఎస్‌ వదిలి సీఎం అయ్యిందెవరు? ఎంపీలో ఏం జరుగుతోంది?

Published on Sun, 10/22/2023 - 12:19

మధ్యప్రదేశ్‌లో ఎన్నికలకు ముందు బ్యూరోక్రాట్లు(పరిపాలనా విభాగంలోని ఉన్నతాధికారులు) రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నారు. ఐఏఎస్ అధికారి రాజీవ్ శర్మ రాజీనామా ఆమోదం పొందింది. రాష్ట్ర అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌కు చెందిన నిషా బాంగ్రే రాజీనామా ఆమోదం  పెండింగ్‌లో ఉంది. అయితే తాను ప్రస్తుతానికి రాజకీయాల్లోకి రానని రాజీవ్ చెప్పగా, నిషా మాత్రం రాజకీయ రంగంలోకి దూకేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.

ఐఏఎస్ సర్వీస్ నుంచి రిటైర్డ్ అయిన కొందరు అధికారులు రెండు నెలల క్రితమే బీజేపీలో చేరగా, మరికొందరు రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు క్యూలో ఉన్నారు. కాగా ఒక ఉన్నతాధికారి రాజకీయాల్లో విజయవంతమయ్యారనే దానికి ఉదాహరణ ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి అజిత్ జోగి. ఈయన ఐఏఎస్‌ సర్వీస్ వదిలి కాంగ్రెస్‌లో చేరారు. తరువాతి కాలంలో ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి అయ్యారు.

మధ్యప్రదేశ్‌కు చెందిన పలువురు ఉన్నతాధికారులు తమ పదవులను వదిలి రాజకీయాల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 
అజాతశత్రు: ఐఏఎస్‌ సర్వీస్ నుండి రిటైర్ అయ్యాక బీజేపీలో చేరారు. 
అజితా వాజ్‌పేయి పాండే: ఐఏఎస్‌ నుండి పదవీ విరమణ చేసిన తర్వాత కాంగ్రెస్‌లో చేరారు.
జీఎస్‌ దామోర్: నీటి వనరులశాఖలో ఇంజనీర్ అయిన ఈయన బీజేపీ నుంచి పోటీ చేసి, రత్లాం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
హీరాలాల్ త్రివేది: ఐఏఎస్‌ సర్వీస్ నుండి రిటైర్ అయ్యాక ‘స్పాక్స్‌’ పార్టీని స్థాపించారు.
రుస్తమ్ సింగ్: ఇండియన్ పోలీస్ సర్వీస్‌ నుంచి పదవీ విరమణ చేశాక బీజేపీలోకి వచ్చారు. మంత్రిగా కూడా అయ్యారు.
ఎస్ ఎస్ ఉప్పల్ : ఐఏఎస్ నుంచి రిటైర్ అయ్యాక బీజేపీలో చేరారు.
వరదమూర్తి మిశ్రా:  ఐఏఎస్‌ ఉద్యోగాన్ని వదిలి, ప్రత్యేక పార్టీని స్థాపించారు.
వీణా ఘనేకర్: ఐఏఎస్‌ నుండి పదవీ విరమణ తర్వాత స్పాక్స్‌లో చేరారు.
వీకే బాతం: ఐఏఎస్‌ నుండి పదవీ విరమణ చేశాక కాంగ్రెస్‌లో చేరారు.

ఉన్నతాధికారులు రాజకీయాల్లో  ప్రవేశించడం వెనుక ఒక కారణమందని విశ్లేషకులు అంటున్నారు. వీరు ఎమ్మెల్యేలను, మంత్రులను దగ్గరి నుంచి చూడటం వలన వారి హోదాకు ప్రభావితమవుతుంటారు. దీంతో రాజకీయాల్లో తాము కూడా రాణించగలమన్న భావన వారిలో కలుగుతుంది. ఈ నేపధ్యంలోనే వారు రాజకీయ నాయకులు, పార్టీలతో సత్సంబంధాలు ఏర్పరుచుకుని, రాజకీయాల్లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తుంటారు.
ఇది కూడా చదవండి: నాటి రాజీవ్‌ సభ చారిత్రకం.. సీటు మాత్రం బీజేపీ పరం!

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)