Breaking News

‘రామేశ్వరం కేఫ్‌’ ఘటనపై ఉన్నతస్థాయి సమావేశం నేడు!

Published on Sat, 03/02/2024 - 11:02

బెంగళూరులోని రాజాజీనగర్‌లోని రామేశ్వరం కేఫ్‌లో భారీ పేలుడు సంభవించి, పలువురు గాయపడ్డారు. ఈ ఘటనపై సమీక్షించేందుకు నేడు(శనివారం) మఖ్యమంత్రి సిద్ధరామయ్య సారధ్యంలో ఉన్నత స్థాయి సమావేశం జరగనుంది.

రామేశ్వరం కేఫ్‌లో గుర్తు తెలియని బ్యాగ్‌ను ఉంచారని, ఆ తర్వాత కొంతసేపటికి భారీ పేలుడు సంభవించిందనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఈ ఘటనలో గాయపడినవారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, కర్ణాటక పోలీసుల ఫోరెన్సిక్ బృందం ఈ ఉదంతంపై దర్యాప్తు చేపట్టింది. మరోవైపు ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం  ఈరోజు(శనివారం) మధ్యాహ్నం ఒంటిగంటకు  ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనుంది. ముఖ్యమంత్రి సారధ్యంలో జరిగే ఈ సమావేశానికి పలువురు మంత్రులు, అధికారులు హాజరుకానున్నారు.

బెంగుళూరులోని రామేశ్వరం కేఫ్‌లో జరిగిన పేలుడు ఘటనపై పోలీసులు ఐపీసీలోని సెక్షన్‌లు 307, 471, యూఏపీఏలోని 16, 18, 38 సెక్షన్‌ల కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. పేలుడు పదార్థాల చట్టంలోని మూడు, నాలుగు సెక్షన్లను కూడా ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. పేలుడు జరిగిన ప్రదేశంలో దర్యాప్తు బృందం తనిఖీలు చేస్తోంది.

ఈ ఘటనపై కర్ణాటక హోంమంత్రి డాక్టర్‌ జి.పరమేశ్వర్‌ మాట్లాడుతూ ‘ఈ కేసు దర్యాప్తు కోసం మేము పలు బృందాలను ఏర్పాటు చేశాం. సీసీటీవీ ఫుటేజీల నుంచి ఆధారాలు సేకరించాం. పేలుడు సంభవించిన సమయంలో బీఎంటీసీ బస్సు ఈ మార్గంలో వెళుతూ కనిపించింది. అనుమానితుడు ఆ బస్సులో వచ్చినట్లు మాకు సమాచారం ఉంది. నిందితులను వీలైనంత త్వరలో పట్టుకుంటాం. పేలుడు కోసం టైమర్‌ని ఉపయోగించారు. దీనిపై ఎఫ్‌ఎస్‌ఎల్‌ బృందం విచారణ జరుపుతోంది’ అని తెలిపారు. 
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)