Breaking News

జార్ఖండ్‌ కాంగ్రెస్‌లో విభేదాలు

Published on Sat, 07/12/2025 - 06:26

సాక్షి, న్యూఢిల్లీ: జార్ఖండ్‌ రాష్ట్ర కాంగ్రెస్‌లో నేతల మధ్య విభేదాలు, అంతర్గత కుమ్ములా టలు, పరస్పర ఆరోపణల పర్వం మరోసారి తెరపైకి వచ్చాయి.కాంగ్రెస్‌ నేతల విభేదాలు ఢిల్లీ దాకా చేరడంతో, అధిష్టానం సీరియస్‌గా తీసుకుంది. వ్యవహారాన్ని చక్కదిద్దే బాధ్యతను ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జ్‌ కొప్పుల రాజుకు అప్పగించింది. 

రాష్ట్ర నేతలందరినీ ఆయన ఢిల్లీకి పిలిపించి సుదీర్ఘ మంతనాలు జరిపారు. కాంకే ఎమ్మెల్యే సురేష్‌ బైతా, కార్యనిర్వాహక అధ్యక్షుడు బంధు తిర్కీ, ఆరోగ్య మంత్రి ఇర్ఫాన్‌ అన్సారీ, ఆర్థిక మంత్రి రాధాకృష్ణ కిషోర్‌లతో ఆయన భేటీ అయ్యారు. జాగ్రత్తగా మసలు కోవాలని, విభేదాలపై రచ్చకెక్కరాదని, సమన్వయంతో కూటమి బలోపేతానికి కృషి చేయాలని వారికి గట్టిగా చెప్పారు. 

మూల కారణమిదే..!
రాంచీలోని రిమ్స్‌ (రాజేంద్ర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌) డైరెక్టర్‌ తొలగింపు అంశం వివాదానికి తెరతీసింది. రిమ్స్‌ డైరెక్టర్‌ తొలగింపునకు సంబంధించిన లేఖపై తాను సంతకం చేయనని కాంకే ఎమ్మెల్యే సురేష్‌ బైతా బహిరంగంగా ప్రకటించారు. ఈ అంశం పార్టీలో ఉద్రిక్తతను సృష్టించింది. పార్టీని, కూటమి ప్రతిష్టను దెబ్బతీసేలా బహిరంగ వేదికపై అలాంటివి వెల్లడించరాదని ఆరోగ్య మంత్రి ఇర్ఫాన్‌ అన్సారీ ఆయనకు సూచించారు. అయితే, బైతా వెనక్కి తగ్గలేదు.

 మరోవైపు, రిమ్స్‌–2 ప్రతిపాదనపై జార్ఖండ్‌ పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బంధు తిర్కీ అభ్యంతరం వ్యక్తం చేశారు. రిమ్స్‌–2 కోసం తన ప్రాంతంలోని రైతుల భూమిని సేకరించడాన్ని ఆయన వ్యతిరేకించారు. ప్రస్తుతమున్న రిమ్స్‌పై పెరుగుతున్న ఒత్తిడిని తగ్గించడానికే రిమ్స్‌–2ను తెరపైకి తెచ్చినట్లు సీఎం హేమంత్‌ సోరెన్‌ అంటున్నారు. ఆరోగ్య మంత్రి ఇర్ఫాన్‌ అన్సారీ కూడా ఈ ప్రతిపాదనపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో సంకీర్ణంలో ఉద్రిక్తతలకు దారితీసింది.
  
 

Videos

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు