Breaking News

Interim Budget 2024: లక్షద్వీప్‌కు నిర్మలమ్మ వరాలు

Published on Thu, 02/01/2024 - 15:40

ఢిల్లీ: కేంద్ర మధ్యంతర బడ్జెట్‌ను నేడు పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా లక్షద్వీప్‌లకు నిర్మలా సీతారామన్ వరాలు కురిపించారు. లక్షద్వీప్‌లను టూరిస్ట్ హబ్‌గా మార్చడానికి భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టనున్నామని తెలిపారు. లక్షద్వీప్‌లో పర్యాటకానికి మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తామని హామీ ఇచ్చారు. దేశంలో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.11.11 లక్షల కోట్లను కేటాయిస్తున్నట్లు నేడు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇందులో దీవుల్లో పర్యాటకానికి కావాల్సిన సౌకర్యాలతో పాటు ఓడరేవుల కనెక్టివిటీని పెంచేవిధంగా పలు ప్రాజెక్టులను చేపట్టనున్నట్లు చెప్పారు. 

దేశీయ టూరిజంపై పెరుగుతున్న ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని కీలకమైన పర్యాటక ప్రాంతాల అభివృద్ధిని ప్రోత్సహించేందుకు ఈ బడ్జెట్‌ను కేటాయించారు. సహజమైన బీచ్‌లు, విశిష్ట సాంస్కృతిక వారసత్వానికి పేరుగాంచిన లక్షద్వీప్ ఈ బడ్జెట్‌లో ప్రత్యేకంగా ప్రయోజనం పొందనుంది. 

ఇటీవల రాజకీయం లక్షదీవులు, మాల్దీవుల చుట్టూ తిరుగుతూ వస్తోంది. ప్రధాని మోదీ లక్షదీవుల్లో ఇటీవల పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన లక్షదీవుల్లో దిగిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కాగా.. నెటిజన్లు భారీగా స్పందించారు. లక్షదీవులు.. మాల్దీవులకు ప్రత్యామ్నాయంగా మారుతాయని పలువురు నెటిజన్లు కామెంట్ చేశారు. అయితే.. ప్రధాని మోదీ ఫొటోలకు మాల్దీవుల మంత్రులు వివాదాస్పద ట్వీట్ చేశారు. 

ప్రధాని మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలతో మాల్దీవుల పర్యటనను పలువురు ప్రముఖులతో సహా నెటిజన్లు రద్దు చేసుకున్నారు. బుక్‌ మైషో లాంటి ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ సైట్లు కూడా మాల్దీవుల బుకింగ్స్‌ను రద్దు చేశాయి. మాల్దీవులకు అత్యధిక పర్యాటకులు భారత్‌ నుంచే వెళుతున్న క్రమంలో మనదేశ లక్షద్వీప్‌లపై చర్చ సాగింది. అటు.. మాల్దీవుల్లో కొత్తగా వచ్చిన ప్రధాని ముయిజ్జూ చైనా అనుకూల విధానాలు అనుసరిస్తున్నారు. దీంతో భారత్‌ లక్షదీవులను పర్యాటకానికి అనువుగా మౌలిక సదుపాయాలు కల్పించాలని భావిస్తోంది. 

ఇదీ చదవండి: Budget 2024 Live Updates Telugu: బడ్జెట్‌ సమావేశాలు అప్‌డేట్స్‌..

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)