Breaking News

ఆదాయం ఆశల పల్లకీలో..

Published on Sun, 06/15/2025 - 01:50

దేశంలోని 74 శాతం గ్రామీణ కుటుంబాలు రాబోయే ఒక ఏడాదిలో తమ ఆదాయం గణనీయంగా వృద్ధి చెందుతుందని ఆశిస్తున్నట్లు ‘నాబార్‌’్డ (నేషనల్‌ బ్యాంక్‌ ఫర్‌ అగ్రికల్చర్‌ అండ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌) తాజా సర్వే వెల్లడించింది. 2025 మే నెలలో జరిగిన ఆ సర్వే ప్రకారం – ఈ 74 శాతం అన్నది గత మార్చిలో 72 శాతంగా నమోదైంది. 2024 సెప్టెంబర్‌లో నాబార్డ్‌ ద్వైమాసిక ‘రూరల్‌ ఎకనమిక్‌ కండిషన్స్‌ అండ్‌ సెంటిమెంట్స్‌ సర్వే (ఆర్‌.ఇ.సి.ఎస్‌.ఎస్‌.) ప్రారంభం అయినప్పటి నుంచి – రానున్న ఒక సంవత్సరంలో తమ ఆదాయం పెరుగుతుందని ఆశిస్తున్న వారి శాతంలో ఇదే అత్యధికం. – సాక్షి, స్పెషల్‌ డెస్క్‌

నైరుతితో చిగురించిన ఆశలు
600 గ్రామాల్లో.. ప్రతి నమూనా గ్రామం నుంచి 10 కుటుంబాలను ఎంపిక చేసుకుని 6,000 మందితో నాబార్డ్‌ ఈ సర్వే నిర్వహించింది. ఈ ఏడాది మే నెలలో ఐదవ విడత సర్వే పూర్తయింది. సర్వే ఫలితాలను బట్టి గ్రామీణ ప్రాంతాలలో తమ ఆదాయంలో పెరుగుదలను ఆశించే వారి సంఖ్య పెరగటం మాత్రమే కాకుండా, తమ ఆదాయం క్షీణించవచ్చునని మునుపు అనుకున్న వారి సంఖ్య సర్వే మొదటి విడతలోని 7.3 నుంచి 6.7 శాతానికి తగ్గటం విశేషం. 

గ్రామీణ కుటుంబాలలో ఆదాయం వృద్ధి గురించి పెరుగుతున్న ఆశావాదం.. గత కొన్ని నెలలుగా గ్రామీణ రంగం పుంజుకుంటోందన్న సానుకూల ఆలోచనలకు అనుగుణంగా ఉంది. 2025లో ‘సాధారణం కంటే ఎక్కువ’గా నైరుతి రుతుపవనాల ప్రభావం ఉంటుందన్న అంచనా గ్రామీణ రంగంలో సానుకూల మార్పునకు దోహదపడింది. ఆ సానుకూలత గ్రామీణ భారతదేశంలో వ్యవసాయ వృద్ధిని, కొనుగోలు శక్తిని పెంచుతుందన్న ఆశలు రేపింది. 

పెరగనున్న వాస్తవ వేతనాలు
ఇటీవలి ‘ఇండియా రేటింగ్స్‌’ నివేదిక ప్రకారం కూడా అనుకూల రుతుపవనాల వ్యవసాయ వృద్ధి కారణంగా 2025–26 లో వాస్తవ వేతనాలు (ద్రవ్యోల్బణానికి అనుగుణంగా పెరిగినవి)  స్థిరంగా 6.5 శాతం నుంచి 7 శాతం వరకు వృద్ధి చెందుతాయని అంచనా.  ఏదైనా ప్రతికూల వాతావరణ పరిస్థితులు, సంఘటనలు, రుతుపవనాల పురోగతిలో అంతరాయం, వాణిజ్యం లేదా భౌగోళిక రాజకీయ సమస్యలు సంభవిస్తే మాత్రం వాస్తవ వేతన వృద్ధి రేటు తగ్గవచ్చని కూడా నివేదిక సూచించింది. 

కాగా, నాబార్డ్‌ నివేదిక ప్రకారం.. ఆదాయం పెరుగుదలపై మే నెలలో స్వల్పంగా గ్రామీణ కుటుంబాల ఆశలు చిగురించాయి. 53.8 శాతం మంది మెరుగైన ఆదాయాలు వస్తాయని భావిస్తున్నారు. 2025 మార్చిలో ఈ ఆశ 52.5 శాతంగా మాత్రమే ఉంది. 

ఉపాధి లభ్యతపై సానుకూలత
వచ్చే త్రైమాసికంలో లభించనున్న ఉపాధి అవకాశాలపై అంచనాలు కూడా ఇదే తరహాలో ఉన్నాయి. ఈ ఏడాది మే నెలలో 53.5 శాతం కుటుంబాలు ఉపాధి పరిస్థితుల్లో మెరుగుదలను ఆశించగా, 2024 సెప్టెంబర్‌ తర్వాత ఇదే అత్యధిక ఆశావహ శాతం. కేవలం 8 శాతం మంది మాత్రమే తగ్గుదలను అంచనా వేశారు, ఫలితంగా నికర సానుకూలత 45.4కు చేరుకుందని నాబార్డ్‌ సర్వే వెల్లడించింది. 

2025 జనవరిలో స్వల్పంగా తగ్గిన ఆశలు తిరిగి స్థిరంగా కోలుకున్నాయి. ఈ ఏడాది మే నెలలో కుటుంబ ఆదాయాలు స్వల్ప మెరుగుదలను చూపించాయి. సర్వేలో పాల్గొన్నవారిలో 37.4 శాతం మంది గత సంవత్సరంతో పోలిస్తే తమ ఆదాయంలో పెరుగుదల కనిపించినట్లు తెలిపారు. మార్చిలో ఇది 34.8 శాతంగా ఉంది. అయితే 21.4 శాతం మంది తమ ఆదాయం తగ్గిందని, 41.3 శాతం మంది ‘ఏమో చెప్పలేం’ అని సమాధానం ఇచ్చారు.

పొదుపు ఆలోచన కొంత తగ్గింది!
నాబార్డ్‌ సర్వే ప్రకారం గ్రామీణ ప్రాంతాలలో వినియోగ వ్యయాలు కూడా బలంగానే ఉన్నాయి. 79.1 శాతం కుటుంబాలు తమ ఖర్చు పెరిగినట్లు తెలిపాయి. ఇది మార్చి నెలతో పోలిస్తే (79.9 శాతం) స్వల్పంగా తగ్గినప్పటికీ , నికరంగా 74.6 వద్ద స్థిరంగా ఉంది. ఈ ధోరణి గ్రామీణ కుటుంబాలలోని నిరంతర విశ్వాసాన్ని ప్రతిబింబిస్తోంది. అయితే ఇందుకు భిన్నంగా, పొదుపు చేయాలన్న ఆలోచన తగ్గిపోయింది. 

కేవలం 18.8 శాతం కుటుంబాలు మాత్రమే తమ పొదుపు మొత్తాలు పెరిగినట్లు చెప్పగా, 28.7 శాతం కుటుంబాలు తగ్గాయని తెలిపాయి. ఫలితంగా 9.9 శాతం నికరమైన ప్రతికూలత కనిపించింది.  మార్చి (–11.9) నుంచి ఇది స్వల్ప మెరుగుదలను సూచిస్తున్నప్పటికీ, సర్వేలో వరుసగా ఐదవ విడతలో సైతం పొదుపు బలహీనంగానే ఉంది. 

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)