Breaking News

పిల్లాడి టైమ్‌ టేబుల్‌.. చదువుకు కేటాయించిన టైమ్‌ చూస్తే నవ్వాపుకోలేరు!

Published on Sun, 06/25/2023 - 13:19

సోషల్‌ మీడియాలో చిన్న పిల్లల చిలిపి చేష్టలకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్‌ అవుతూ, నెటిజన్లను అమితంగా అలరిస్తుంటాయి. వీటిని చూసినప్పుడు మనకు ఉండే ఒత్తిడి క్షణాల్లో మాయం అవుతుంటుంది. సాధారణంగా చిన్నారులకు అంత త్వరగా చదువుపై మనసు లగ్నం కాదు. అయితే కొందరు పిల్లలు అటు టీచర్లు చెప్పారనో లేదా తల్లిదండ్రులు చెప్పారనో సొంత టైమ్‌ టేబుల్‌ తయారు చేసుకుంటుంటారు. వీటిలో రోజువారీ దినచర్య రాసుకుంటారు. ఈ కోవలో ఒక కుర్రాడు తయారు చేసుకున్న టైమ్‌ టేబుల్‌ ఇప్పుడు వైరల్‌గా మారింది. దీనిని చూసిన వారు కడుపుబ్బా నవ్వుకుంటున్నారు. 

క్రమశిక్షణ కోసం టైమ్‌ టేబుల్‌
ట్విట్టర్‌ యూజర్‌ @Laiiiibaaaa ఒక పోస్టు షేర్‌ చేశారు. దీనిని చూసినవారెవరైనా నవ్వకుండా ఉండలేకపోతున్నారు. ఆరేళ్ల పిల్లాడు తనను తాను క్రమశిక్షణతో ఉంచుకునే ఉద్దేశంతో తన 24 గంటల దినచర్యకు సంబంధించిన టైమ్‌ టేబుల్‌ రూపొందించుకున్నాడు. ఈ పిల్లాడు తాను చేయాల్సిన అన్ని పనులకు అధిక సమయం కేటాయిస్తూ, చదువుకునేందుకు కేవలం 15 నిముషాలు మాత్రమే కేటాయించాడు. ఇదే నెటిజన్లను తెగ నవ్విస్తోంది. 

ఏమేమి రాశాడంటే..
ఆ పిల్లాడు తన టైమ్‌ టేబుల్‌లో నిద్ర నుంచి లేచే సమయం, వాష్‌రూమ్‌, బ్రేక్‌ఫాస్ట్‌, టీవీ టైమ్‌, స్నానం చేసే సమయం, లంచ్‌, నిద్రించే సమయం. ప్లే విత్‌ రెడ్‌ కార్, అత్త ఇంటికి వెళ్లే సమయం.. ఇలా అన్నింటికీ రోజులో కొంత సమయాన్ని కేటాయించాడు. అయితే చదువుకునేందుకు కేవలం 15 నిముషాల సమయం మాత్రమే కేటాయించాడు. ఈ పోస్టుకు ఇప్పటివరకూ 12 మిలియన్లకు పైగా వీక్షణలు దక్కాయి. 

ఇది కూడా చదవండి: దిమ్మతిరిగే ఆ పట్టణం పేరు చదివితే..జీనియస్‌!

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)