Breaking News

పోలీస్టేషన్‌కు చెత్త పంచాయితీ..పారిశుధ్య కార్మికులపై తుపాకీ ఎక్కుపెట్టి..

Published on Mon, 04/17/2023 - 16:30

చెత్త విషయంలో తలెత్తిన వివాదం కాస్త పోలిస్టేష్టన్‌లో ఫిర్యాదు చేసేంత వరకు వెళ్లింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..ఇండోర్‌కు చెందిన వ్యాపారవేత్త, పెట్రోల్‌ పంప్‌ యజమాని మహేష్‌ పటేల్‌కి పారిశుధ్య కార్మికులకు మధ్య చెత్త విషయమై వివాదం తలెత్తింది. అతడి ఇంటి వద్ద చెత్తను సేకరిస్తున్నప్పుడూ ఈ ఘటన చోటు చేసుకుంది. పటేల్‌ భార్య పొడి, తడి చెత్తను వేరు చేయనందున గొడవ జరిగింది. దీంతో ఆమె భర్త పటేల్, అతడి కుమారుడు పారిశుధ్య కార్మికులతో వాగ్వాదానికి దిగారు.

ఇంతలో ఆ మహేష్‌ లోపలి నుంచి తుపాకీ తీసుకుని వచ్చి బెదిరింపులకు గురిచేశాడు. దీంతో అక్కడ నుంచి పారిశుధ్య కార్మికులు ఒక్కసారిగా పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసు అధికారి సంఘటనా స్థలానికి చేరకుని ఇరు వర్గాల మధ్య సయోధ్య కుదర్చారు కూడా. గానీ చెత్త వ్యాన్‌లను నడుపుతున్న డ్రైవర్ల సంఘం సభ్యులు బెదిరింపులకు గురైన పారిశుధ్య కార్మికులతో కలిపి పోలీసులను ఆశ్రయించి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు.

ఆ వ్యాపారి బీజేపీ మాజీ శాసనసభ్యుడు మనోజ్‌ పటేల్‌ బంధువు కావడంతోనే పోలీసులు ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోలేదంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఐతే అందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవ్వడంతో స్పందించిన పోలీసు అధికారి ఆశిష్‌ మిశ్రా ఆ ఘటనపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ముందుగా అక్కడ అసలేం జరిగిందే నిర్థారించడానికి ఫిర్యాదుదారుణ్ణి సంప్రదించి తదుపరి దర్యాప్తు ప్రారంభిస్తామని చెప్పారు.  

(చదవండి: పులి భయంతో హడలిపోతున్న గ్రామాలు..దెబ్బకు కర్ఫ్యూ, పాఠశాలలు మూసివేత)

Videos

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)