Breaking News

ప్రయాణీకులు ఆరుగురే అని... దించేసి పోయారు!

Published on Tue, 11/21/2023 - 12:46

చెన్నై: ఇండిగో విమానంలో ఆరుగురు ప్రయాణికులకు చేదు అనుభవం ఎదురైంది. కేవలం అరుగురు ప్రయాణికులే ఉన్నందున విమాన ప్రయాణాన్ని సిబ్బంది నిలిపివేశారు. మరో ప్రత్యామ్నాయ ఏర్పాటు చేస్తామని ప్రయాణికుల్ని సిబ్బంది తెలివిగా దించేశారు. అనంతరం ఎలాంటి ఏర్పాటు చేయలేదు. దీంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. 

ఇండిగో 6E478 విమానం అమృత్‌సర్ నుంచి చెన్నై వెళుతుంది. మధ్య బెంగళూరు చేరుకునే సరికి రాత్రి 9:30 అయింది. కెంపెగౌడ విమానాశ్రయంలోనే ప్రయాణికులందరూ దిగిపోయారు. కేవలం ఆరుగురు మాత్రమే మిగిలారు. ఆరుగురు ప్రయాణికుల కోసం బెంగళూరు నుంచి చెన్నై వరకు వెళ్లడం ఇష్టం లేని సిబ్బంది.. వారిని తెలివిగా కిందకు దించేశారు. రాత్రి ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండానే ప్రయాణికులను గాలికి వదిలేశారు. 

'కెంపెగౌడ విమానాశ్రయానికి చేరుకోగానే సిబ్బంది తమకు ఫోన్‌ చేసి మరో విమానం అందుబాటులో ఉందని చెప్పారు. బోర్డింగ్ పాస్ కూడా సిద్ధంగా ఉందని చెప్పి రాత్రి 9:30 సమయంలో విమానం కిందికి దించేశారు. కానీ రాత్రి ఎలాంటి ఏర్పాటు చేయలేదు' అని ఓ ప్రయాణికుడు ఆవేదన వ్యక్తం చేశారు. మరోమారు ఇలాంటి పరిస్థితి ఎదురవకూడదని నిరసన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన యంత్రాంగం.. ఉదయాన్నే వారిని ఇతర విమానంలో చెన్నైకి పంపించామని తెలిపింది.  

ఇదీ చదవండి: PM Modi Met Team India Video: డ్రెస్సింగ్ రూంలో క్రికెటర్లను ఓదార్చిన మోదీ

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)