Breaking News

ఇండిగో ప్రకటన

Published on Sun, 12/07/2025 - 10:32

గత కొద్ది రోజులుగా విమానాల రాకపోకలు నిలిచిపోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రయాణికులకు ఇండిగో  శుభవార్త తెలిపింది. ఆదివారం సాయంత్రం కల్లా 1,500 విమానాలు అందుబాటులోకి తేనున్నట్లు ప్రకటించింది. తమ నెట్ వర్క్ కనెక్టివిటీలో  దాదాపు 95శాతం మేర నెట్ వర్క్ రీబూట్ చేశామని పేర్కొంది. 

ఇండిగో ఎయిర్ లైన్స్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ పేరుపైనే చర్చంతా. సిబ్బంది కొరతతో విమానాయాన సంస్థ సేవలు అర్థాంతరంగా నిలిపివేయడంతో ఇండియా వ్యాప్తంగా ప్రయాణికుల రాకపోకలు దెబ్బతిన్నాయి. సాధారణ ప్రయాణికులతో పాటు ఎంతో మంది ప్రొఫెషనల్స్ తమ గమ్య స్థానాలకు చేరుకోలేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎయిర్ పోర్టులలో నిరీక్షిస్తూ అవస్థలు పడ్డారు. దీంతో కేంద్రం ప్రభుత్వం ఇండిగో పద్దతిపై సీరియస్ అయ్యింది. ఇంత పెద్దసంఖ్యలో ప్రయాణికులు ఇబ్బందులు పడుతుంటే పట్టించుకోవడం లేదని ఫైరయ్యింది.

ఈ నేపథ్యంలో ఇండిగో తమ కార్యకలాపాలను పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించింది. తమ విమానాయాన నెట్‌వర్క్ ను దాదాపు పూర్తిస్థాయిలో పునరుద్ధరిస్తున్నట్లు పేర్కొంది. ఆదివారం సాయంత్రం వరకూ 1500 విమానాలు నడుపనున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఇండిగో  138 రూట్లలో సేవలందిస్తుండగా 135 గమ్యస్థానాలకు సేవలు తిరిగి ప్రారంభిస్తున్నట్లు పేర్కొంది. దీంతో దాదాపు 95 శాతం మేర రూట్లు రీకనెక్ట్ అయినట్లు పేర్కొంది. సాధారణంగా ఇండిగో నడిపే ఫ్లైట్ల సంఖ్య 700కాగా ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో వాటి సంఖ్య 1500కు పెంచినట్లు తెలిపింది.

ఇండిగోపై ప్రజలు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నామని, ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉందని ప్రకటించింది. ఈ కష్టకాలంలో అండగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు తెలిపింది. ఇండిగో సిబ్బంది కొరతతో విమానాలను అర్థాంతరంగా నిలిపివేయడంతో దేశవ్యాప్తంగా ప్రయాణాలు స్తంభించి పోయాయి. ప్రయాణికులు రోజుల తరబడి ఎయిర్ పోర్టులలో నిరీక్షించారు. దీంతో ఈ దేశీయ విమానయాన సంస్థపై పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. కాగా ప్రస్తుతం ఇండిగో ప్రకటనతో విమానాల కోసం ఎదురుచూస్తున్న చాలామంది ప్రయాణికులకు ఉపశమనం లభించినట్లయింది.

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)