Breaking News

ఇండిగోకు ఏమైంది? మరో బాంబు బెదిరింపు కాల్‌

Published on Thu, 12/04/2025 - 17:29

దేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగోను పలు కష్టాలు ఒక్ సారిగా చుట్టుముట్టాయి. ఇండిగో విమానాలకు గురువారం కొన్ని గంటల్లోనే రెండు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇండిగో మదీనా-హైదరాబాద్ విమానాన్ని  దారి మళ్లించి సురక్షితంగా ల్యాండ్‌ అయిందో  లేదో మరో బెదిరింపు కాల్‌  రావడం కలకలం  రేపుతోంది.

ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైద‌రాబాద్ త‌దిత‌ర ప్రాంతాల‌తోపాటు ఇతర ప్రాంతాల‌కు చెందిన‌ 300కి పైగా విమానాల రద్దుతో విమాన ఆలస్యాన్ని, ప్రయాణికుల ఆగ్రహాన్ని ఎదుర్కొంటోంది ఇండిగో. తాజాగా మరో  బాంబు బెదిరింపు కాల్‌ రావడంతో  షార్జా నుంచి హైదరాబాద్  బయలుదేరిన విమానాన్ని ముంబై విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. ఈ విమానం షార్జా నుండి బయలుదేరి హైదరాబాద్ వెళ్తుండగా, గాలిలో ఉండగానే  బెదిరింపు  కాల్‌ వచ్చింది. దీంతో అప్రమత్తమైన స్థానిక పోలీసులు ,ముంబై విమానాశ్రయానికి చేరుకుని కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళానికి సహాయం చేశారు. రెండవ బాంబు బెదిరింపుపై అధికారులు ఇంకా ప్రకటన విడుదల చేయలేదు.

ఒక్కరోజులో 250కిపైగా విమానాలు రద్దు

గురువారం తెల్లవారుజామున బాంబు బెదిరింపు రావడంతో మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో  ఇండిగో విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది. సౌదీ అరేబియాలోని మదీనా నుండి హైదరాబాద్‌కు వెళ్తున్న విమానం అహ్మదాబాద్‌కు మళ్లించాల్సి వచ్చింది. విమానం సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ కావడంతో అందరూ ఊపిరి  పీల్చుకున్నారు. దీనిపై  పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.

 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)