Breaking News

కో పైలట్‌ బలవంతంగా టాయిలెట్‌లోకి వచ్చాడు

Published on Wed, 08/20/2025 - 07:58

ముంబై: ఇండిగో విమాన ప్రయాణికురాలు చేసిన ఫిర్యాదు తీవ్ర కలకలం రేపుతోంది. విమానం టాయిటెల్‌ సీటుపై తాను కూర్చుని ఉండగానే కో పైలట్‌ అందులోకి బలవంతంగా ప్రవేశించాడని ఆరోపించారు. ఆగస్ట్‌ 8వ తేదీ రాత్రి విమానం టేకాఫ్‌ తీసుకోకమునుపే ఇలా జరిగిందని ఆమె తెలిపారు. బంగారం వ్యాపార సంస్థ ‘సేఫ్‌ గోల్డ్‌’సహ వ్యవస్థాపకురాలు రియా ఛటర్జీ ఇందుకు సంబంధించి తనకు కలిగిన ఇబ్బందికరమైన అనుభవాన్ని లింక్డ్‌ ఇన్‌లో షేర్‌ చేశారు. కో పైలట్‌ చర్య తనకు షాక్‌ కలిగించిందని పేర్కొన్నారు. ‘లావెట్రీ లోపలికెళ్లి లాక్‌ చేసుకున్నాక, తలుపుపై తట్టిన శబ్ధం వినిపించగా బదులిచ్చా. 

ఆ వెంటనే మరోసారి తలుపు చప్పుడు వినిపించగా మరింత బిగ్గరగా బదులిచ్చా. అయినప్పటికీ కో పైలట్‌ బలవంతంగా తలుపు నెట్టుకుని లోపలికి వచ్చాడు. తనను చూసి, ఓహ్‌ అనుకుంటూ డోరు మూసి వెళ్లిపోయాడు’అని వివరించారు. ఇది తెలిసిన మహిళా సిబ్బంది సారీతో సర్ది చెప్పేందుకు ప్రయత్నించారు. మరో గత్యంతరం లేక నా సీటులోకి వెళ్లి కూర్చున్నానని ఛటర్జీ తెలిపారు. ఘటనపై ఇండిగో యాజమాన్యానికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. వారెవరూ తనతో నేరుగా మాట్లాడలేదని ఆరోపించారు. అయితే, ఈ ఘటనపై పరిహారం కావాలని కోరుకోవడం లేదని స్పష్టం చేశారు.  

Videos

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు