Breaking News

విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా.. భారత్‌ పాస్‌పోర్టుతో 57 దేశాలకు..

Published on Thu, 07/27/2023 - 07:47

విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా?.. అయితే ఎలాంటి వీసా లేకుండా కేవలం భారత పాస్‌పోర్టుతో 57 దేశాలకు వెళ్లిపోవచ్చు. తాజాగా లండన్‌కు చెందిన హెన్లీ పాస్‌పోర్టు ఇండెక్స్‌ ర్యాంకుల్లో భారత్‌ 80వ స్థానంలో నిలిచింది. మనతోపాటు సెనెగల్, టోగోలకు కూడా 80వ ర్యాంక్‌ లభించింది. 

సాక్షి, అమరావతి: గత ఐదేళ్లుగా భారత్‌ ర్యాంకు మెరుగుపడుతుండటం విశేషం. 2022లో భారత్‌ 87వ స్థానంలో నిలిచింది. కాగా ఈ ఏడాది అగ్రస్థానంలో సింగపూర్‌ నిలిచింది. ఈ దేశానికి చెందిన పాస్‌పోర్టుతో 192 దేశాలకు వెళ్లే అవకాశం ఉంది. ఈ క్రమంలో సింగపూర్‌ గతేడాది ర్యాంకుల్లో ముందున్న జపాన్‌ను అధిగమించింది. ఇక జర్మనీ, ఇటలీ, స్పెయిన్‌లు రెండో స్థానంలో నిలిచాయి. ఈ దేశాల పాస్‌పోర్టులతో వీసా లేకుండా 190 దేశాలకు వెళ్లొచ్చు. జపాన్, ఆస్ట్రియా, ఫిన్లాండ్, ఫ్రాన్స్, లక్సెంబర్గ్, దక్షిణ కొరియా, స్వీడన్‌ మూడో స్థానం దక్కించుకు­న్నాయి. ఈ దేశాల పాస్‌పోర్టులతో 189 దేశాలకు వెళ్లే అవకాశం ఉంది. బ్రిటన్‌ నాలుగో స్థానాన్ని కైవసం చేసుకుంది. 

వీసా లేకుండా వెళ్లగలిగే దేశాలు
బార్బడోస్, భూటాన్, బొలీవియా, బ్రిటిష్‌ వర్జిన్‌ దీవులు, బురుండి, కంబోడియా, కుకు దీవులు, కేప్‌ వెర్డే దీవులు, కొమొరో దీవులు, జిబౌటి, డొ­మి­నికా, ఎల్‌ సాల్వడార్, ఫిజీ, గబాన్, గ్రెనడా, గినియా–బిస్సావు, హైతీ, ఇండోనేషియా, ఇరాన్, జమైకా, జోర్డాన్, కజకిస్థాన్, లావోస్, మకావు, మడగాస్కర్, మాల్దీవులు, మార్షల్‌ దీవులు, మౌరిటానియా, మారిషస్, మైక్రో­నే­షియా, మోంట్సెరాట్, మొజాంబిక్, మయన్మార్, నేపాల్, నియు, ఒమన్, పలావు దీవులు, ఖతార్, రువాండా, సమోవా, సెనెగల్, సీషెల్స్‌ దీవులు, సియర్రా లియోన్, సోమాలియా, శ్రీలంక, సెయింట్‌ కిట్స్‌ అండ్‌ నెవిస్, సెయింట్‌ లూసి­యా, సెయింట్‌ విన్సెంట్, టాంజానియా, థాయి­లాండ్, తైమూర్‌–లెస్టే, టోగో, ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగో, ట్యునీషియా, తువాలు, వనటు, జింబాబ్వే. 

► దాదాపు పదేళ్ల క్రితం వరకు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్న అమెరికా ఎనిమిదో స్థానా­­నికి పడిపోయింది. ఈ మేరకు ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ ట్రాన్స్‌­పోర్ట్‌ అసోసియేషన్‌ (ఐఏటీఏ) డేటా ఆధారంగా తాజాగా వీసా లేకుండా ప్రయా­ణించే దేశాలకు హెన్లీ పాస్‌పోర్టు ఇండెక్స్‌ ర్యాంకులను ప్రకటించింది. 

చెత్త పాస్‌పోర్టు గల దేశాల్లో పాకిస్థాన్‌
హెన్లీ పాస్‌పోర్టు ఇండెక్స్‌ ర్యాంకింగ్స్‌లో పాకిస్థాన్‌ నాలుగో చెత్త పాస్‌పోర్ట్‌ కలిగిన దేశంగా నిలిచింది. పాక్‌ పాస్‌పోర్టుతో వీసా లేకుండా కేవలం 33 దేశాలకు వెళ్లడానికి మాత్రమే వీలుంది. ఇక ఆఫ్ఘనిస్థాన్, ఉత్తర కొరియా, పపువా న్యూ గినియా, తుర్కిమెనిస్థాన్‌ దేశాలకు జీరో ర్యాంక్‌ లభించింది. అంటే ఈ దేశాల ప్రజలు వీసా లేకుండా పాస్‌పోర్టుతో ఏ దేశంలోకి ప్రవేశించలేరు. 

ఇది కూడా చదవండి: గవర్నర్‌కు డీఎంకే ఫైల్స్‌–2

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)