వీసా లేకుండా 62 దేశాలు చుట్టొచ్చు

Published on Sun, 05/19/2024 - 08:14

సాక్షి, అమరావతి:  వీసా రహిత విదేశీ పర్యటనలకు భారతీయ పాస్‌పోర్టు విస్తృత అవకాశం కల్పిస్తోంది. ప్రపంచంలోని విభిన్న సంస్కృతులు, సుందరమైన ప్రకృతి దృశ్యాలు, చారిత్రక అద్భుతాలను అన్వేíÙంచడానికి మార్గాన్ని సులభతరం చేస్తోంది. యూకేకు చెందిన హెన్లీ పాస్‌పోర్టు ఇండెక్స్‌–2024 నివేదిక ప్రకారం.. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్టుల జాబితాలో భారత్‌ 80వ స్థానంలో నిలిచింది. గతేడాది నుంచి పాస్‌పోర్టు ర్యాంకింగ్స్‌లో భారత్‌ స్థిరంగా ఉన్నప్పటికీ, వీసా రహిత గమ్యస్థానాల సంఖ్యలో గణనీయమైన పెరుగుదల కనిపిస్తోంది. ఈ క్రమంలోనే వీసా అవసరంలేకుండా భారతీయులు ప్రయాణించగలిగే దేశాల సంఖ్య 
57 నుంచి 62కు పెరిగింది. ముఖ్యంగా భారతీయ పర్యాటకులను ఆకర్షించే లక్ష్యంతోనే ఆగ్నేయాసియా, యూరప్, ఆఫ్రికా, కరేబియన్‌ దేశాలు తమ ఐకానిక్‌ ల్యాండ్‌మార్క్‌లు, సహజమైన బీచ్‌లు, సాంస్కృతిక ప్రదేశాల్లో వీసా రహిత ప్రయాణాలకు అనుమతిస్తున్నాయి. 
  
టాప్‌లో ఆరు దేశాలు.. 
అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్టు ప్రయాణాల్లో ఆసియా, ఐరోపా దేశాలు అగ్రస్థానాన్ని 
పంచుకున్నాయి.  
👉 సింగపూర్, జపాన్‌తో పాటు ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్‌ దేశాలు 227 విదేశీ గమ్యస్థానాలకుగాను 194 ప్రదేశాలకు వీసా రహిత ప్రయాణాలు చేసేందుకు అనుమతిస్తున్నాయి.  
👉    దక్షిణ కొరియా, స్వీడన్, ఫిన్‌లాండ్‌ల పాస్‌పోర్టులు 193 గమ్యస్థానాలకు యాక్సెస్‌గా ఉంటూ రెండో స్థానంలో..  
👉    ఆ్రస్టియా, డెన్మార్క్, ఐర్లాండ్, నెదర్లాండ్స్‌ 192 దేశాలకు ఉచిత వీసా అనుమతులను అందిస్తూ మూడో స్థానంలో నిలుస్తున్నాయి.  
👉యూఏఈ గడిచిన దశాబ్దంగా అత్యతంగా వేగంగా వృద్ధి చెందుతూ 11వ స్థానానికి చేరుకుని 183 దేశాల్లో ఫ్రీ వీసా ప్రయాణ సౌలభ్యాన్ని సాధించింది.  
👉    ఇక గతేడాదితో పోలిస్తే చైనా రెండు స్థానాలు ఎగబాకి 62వ స్థానంలో 85 దేశాలకు వీసాలేని ప్రయాణాలకు అనుమతిస్తోంది. 

ఏడో స్థానానికి యూఎస్‌ వీసా పరిమితం.. 
అమెరికా పాస్‌పోర్టు సామర్థ్యం దశాబ్దకాలంలో దిగజారింది. 2006–2014 మధ్య అగ్రస్థానంలో కొనసాగగా 2020 నుంచి ఏడో స్థానానికి పరిమితమైంది. పాస్‌పోర్టు ర్యాంకుల్లో ఆఫ్ఘనిస్తాన్‌ అట్టడుగున నిలుస్తూ కేవలం 28 దేశాలకు మాత్రమే ఫ్రీ వీసా ప్రవేశాలు లభిస్తున్నాయి. సిరియా 29, ఇరాక్‌ 31, పాకిస్తాన్‌ 34, యెమెన్‌ 35 దేశాలకు ఉచిత వీసా ప్రయాణాలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వీసా అవసరంలేకుండా సగటు ప్రయాణికులు వెళ్లిన గమ్యస్థానాల సంఖ్య 2006లో 58 నుంచి 2024 నాటికి 111కి రెట్టింపు కావడం విశేషం.

భారత్‌ పాస్‌పోర్టుతో వీసాలేకుండా ప్రయాణించే దేశాలు..
అంగోలా, బార్బడోస్, భూటాన్, బొలీవియా, బ్రిటిష్‌ వర్జిన్‌ దీవులు, బురుండి, కంబోడియా, కేప్‌ వెర్డే దీవులు, కొమొరో దీవులు, కుక్‌ దీవులు, జి»ౌటి, డొమినికా, ఎల్‌ సల్వడార్, ఇథియోపియా, ఫిజీ, గాబన్, గ్రెనడా, గినియా–బిస్సావు, హైతీ, ఇండోనేసియా, ఇరాన్, జమైకా, జోర్డాన్, కజఖస్తాన్, కెన్యా, కిరిబాటి, లావోస్, మకావో (ఎస్‌ఏఆర్‌ చైనా), మడగాస్కర్, మలేసియా, మాల్దీవులు, మార్షల్‌ దీవులు,  మౌరిటానియా, మారిషస్, మైక్రోనేíÙయా, మోంట్సె­రాట్, మొజాంబిక్, మయన్మార్, నేపాల్, నియు, ఒమన్, పలావు దీవులు, ఖతార్, రువాండా,ౖ సమోవా, సెనెగల్, సీషెల్స్, సియర్రా లియోన్, సోమాలియా, శ్రీలంక, సెయింట్‌ కిట్స్‌–నెవిస్, సెయింట్‌ లూసియా, సెయింట్‌ విన్సెంట్‌–గ్రెనడైన్స్, టాంజానియా, థాయ్‌లాండ్, తైమూర్‌–లెస్టే, ట్రినిడాడ్‌–టొబాగో, ట్యునీíÙయా, తువాలు, వనాటు, జింబాబ్వే.

 

#

Tags : 1

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)