Breaking News

కొనుగోళ్లపై రీల్స్, సోషల్‌ మీడియా ఎఫెక్ట్.. 60 శాతం యువతది ఇదే తీరు!

Published on Mon, 04/03/2023 - 08:28

సాక్షి, అమరావతి: భారతీయ యువతలో కొనుగోలు ట్రెండ్‌ మారుతోంది. సరదా షాపింగ్‌ విధానం పెరిగిపోతోంది. ఇదేదో దుకాణాలకు వెళ్లి కాదండోయ్‌.. ఆన్‌లైన్‌లోనే.. అదీ ఇంట్లోనే.. మరీ చెప్పాలంటే వీడియో రీల్స్‌ (షార్ట్‌ వీడియో) చూస్తూ వస్తువుల కొనుగోలును ఎంజాయ్‌ చేస్తున్నారు.

దాదాపు దేశంలో 60 శాతం మంది యువత కొనుగోళ్లను చిన్న వీడియోల్లోని కంటెంట్‌ ప్రభావితం చేస్తోంది.  ప్రముఖ షార్ట్‌ వీడియోస్‌ యాప్‌ సంస్థ ఎమోజీ ‘గెటింగ్‌ యంగ్‌ ఇండియా రైట్‌’ పేరుతో ఒక నివేదికను విడుదల చేసింది. ఇందులో 18–34 ఏళ్ల మధ్య యువతను ఆన్‌లైన్‌లో సర్వే చేసింది. దీని ప్రకారం దేశంలో ఏకంగా 77 శాతం యువత ఎక్కువ సమయం షార్ట్‌ వీడియోలు చూస్తున్నట్టు పేర్కొంది. మరో 16 శాతం మంది వార్తలు, ఇతర వినోద కార్యక్ర­మాలు, 7 శాతం మంది టీవీ, ఓటీటీ ఆధారిత కంటెంట్‌లో మునిగిపోతున్నట్టు గుర్తించింది. 

ఆఫర్లు.. డిస్కౌంట్లదే పైచేయి
కాగా, చిన్న వీడియోలు, సోషల్‌ మీడియా కంటెంట్‌ దేశంలోని యువత కొనుగోలు నిర్ణయాలను ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌ ద్వారా ప్రభావితం చేస్తున్నా­యని నివేదిక స్పష్టం చేస్తోంది. ఆఫర్లు, డిస్కౌంట్లు సగానికి పైగా యువత కొనుగోలు ఆలోచనలను ప్రభావితం చేసే అంశాల్లో ప్రధానంగా ఉన్నట్టు వివరించింది. ఉచిత రవాణా, వేగంగా సరుకు అందించడం కూడా కొనుగోళ్లను పెంచుతోంది.

అత్యధిక ఖర్చు ఆ రెండింటిపైనే..
దేశంలోని 77 శాతం యువత మొబైల్‌ ఫోన్లు, దుస్తులపై అత్యధికంగా ఖర్చు చేస్తున్నట్టు సర్వే చెబుతోంది. వీటి కొనుగోలు కోసం 65 శాతం మంది తమ వ్యక్తిగత నిధులను వినియోగిస్తుంటే.. 26 శాతం మంది స్నేహితులు, కుటుంబ సభ్యులపై ­ఆ«­­దా­రç­³­డుతున్నారు. మరో 7 శాతం మంది బయట అప్పులు చేస్తున్నట్టు సర్వే వెల్లడిస్తోంది. 
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)