Breaking News

United States: టార్గెట్‌ స్టోర్‌లో చోరీ.. పట్టుబడిన భారత మహిళ

Published on Wed, 07/16/2025 - 12:10

వాషింగ్టన్‌: అమెరికాలోని టార్గెట్ స్టోర్‌లో రూ. లక్షకుపైగా విలువైన వస్తువులను దొంగిలిస్తూ భారతీయ మహిళ పట్టుబడింది. బాడీక్యామ్ వీడియోలో ఆమె చోరీకి పాల్పడిన ఘటన రికార్డయ్యింది. యునైటెడ్ స్టేట్స్‌ను సందర్శించేదుకు వచ్చిన ఆమెను ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు.

ఇల్లినాయిస్ ప్రాంతంలోని ఈ స్టోర్‌లో ఏడు గంటలపాటు గడిపిన ఈమె అనుమానాస్పద ప్రవర్తనను అక్కడి సిబ్బంది గమనించి, పోలీసు అధికారులకు సమాచారమిచ్చారు. ఈ రిటైల్ చైన్ నుండి ఆమె లక్షరూపాయలకు పైగా విలువైన వస్తువులను  చోరీ చేసిందని అధికారులు భావిస్తున్నారు. పోలీసులు స్టోర్‌లోని బాడీక్యామ్ ఫుటేజ్‌ను సేకరించారు. సదరు  మహిళ  ఏడు గంటలుగా స్టోర్‌లో తిరగడాన్ని గమనించామని, ఆమె అక్కడి వస్తువులను తీసుకుంటూ,  ఫోన్‌ను చూసుకుంటూ చివరికి డబ్బు చెల్లించకుండా వెళ్లడానికి ప్రయత్నించిందని స్టోర్‌ సిబ్బంది పోలీసులకు తెలిపారు. వారి ఫిర్యాదు అనంతరం పోలీసులు ఆమెకు సంకెళ్లు వేసి, స్టేషన్‌కు తరలించారు. ఆమెపై నేరారోపణలు  మోపినప్పటికీ, ఇంకా అరెస్టు చేయలేదని సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారాలలో వైరల్‌ అవుతోంది. ఈ ఘటనపై టార్గెట్ స్టోర్‌ ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)