Breaking News

భారత్‌లో విచిత్రమైన వాతావరణం!! 123 ఏళ్ల తర్వాత..

Published on Fri, 11/01/2024 - 21:34

ఢిల్లీ: భారత్‌లో దాదాపు 120 ఏళ్ల తర్వాత విచిత్రమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. నవంబర్‌ నెల వచ్చేసింది. అయినా చలి జాడ లేకుండా పోయింది. దీంతో ఈ నెల కూడా సూర్యతాపం తప్పదని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.

భారత్‌లో నెలకొన్ని ఈ అసాధారణ వాతావరణ పరిస్థితులపై ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో భారత వాతావరణ శాఖ(IMD) డైరెక్టర్‌ జనరల్‌ మృత్యుంజయ మహాపాత్ర వివరించారు. బంగాళాఖాతంలో అల్పపీడనలు తరచూ ఏర్పడడం, తూర్పు గాలుల ప్రభావం, పశ్చిమ దిశ నుంచి ఎలాంటి అవాంతరాలు లేకపోవడం.. తదితర కారణాల వల్ల దేశవ్యాప్తంగా వాతావరణం వెచ్చగా ఉంటోందని వెల్లడించారు. అలాగే

వాతావరణ శాఖ గణాంకాల ప్రకారం.. 1901 తర్వాత ఈ ఏడాది అక్టోబర్‌ అత్యంత వెచ్చని నెలగా రికార్డయ్యింది. సాధారణం కంటే.. 1.23 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత అధికంగా నమోదైంది. అలాగే దేశవ్యాప్తంగా సరాసరి ఉష్ణోగ్రత చూసినా.. 1.84 డిగ్రీల సెల్సియస్‌(20.01 డిగ్రీల సెల్సియస్‌ బదులు 21.85 డిగ్రీల సెల్సియస్‌ నమోదైంది) అధికంగానే రికార్డు అయ్యింది.  ఈ గణాంకాలను బట్టి నవంబర్‌ నెల కూడా ఉష్ణోగ్రతల్లో తగ్గుముఖం ఉండకపోవచ్చని ఐఎండీ అంచనా వేస్తోంది. అలాగే.. రాబోయే రెండు వారాలు అధిక ఉష్ణోగ్రతలు కొనసాగవచ్చని చెబుతోంది.

అంటే.. ఈసారి నవంబర్‌ చలితో వణికించదని ఐఎండీ డైరెక్టర్‌ మహాపాత్ర చెబుతున్నారు. అలాగే.. డిసెంబర్‌  నుంచి మొదలయ్యే చలి జనవరి, ఫిబ్రవరి నెలలపాటు కొనసాగుతుందని వెల్లడించారు. అంతేకాదు.. దక్షిణ భారతంలో నవంబర్‌ నెలలో రుతుపవనాల తిరోగమనం సమయంలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉందని కూడా తెలిపారాయన.

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)