Breaking News

‘మా హోటల్‌కు నిప్పు పెట్టారు’.. నేపాల్‌లో భారత పర్యటకురాలు విలవిల

Published on Wed, 09/10/2025 - 12:37

న్యూఢ్లిల్లీ: జనరేషస్‌ జెడ్‌ నిరసనలతో నేపాల్‌ అట్టుడుకిపోతోంది. ఈ నేపధ్యంలో అక్కడున్న పర్యాటకులు పలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అక్కడ చిక్కుకుపోయిన ఒక పర్యాటకురాలు తనను కాపాడాలంటూ భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఉపాసన గిల్‌గా తనను పరిచయం చేసుకున్న ఆమె తనకు ఎదురైన భయానక అనుభవాలను పంచుకున్నారు.

‘నేను స్పాలో ఉండగా, నేను బస చేసిన హోటల్‌కు నిరసనకారులు నిప్పంటించారు. కర్రలు చేత పట్టుకుని కొందరు పరిగెడుతూ అందరినీ భయపెట్టారు. వాలీబాల్ లీగ్‌ను నిర్వహించడానికి నేను నేపాల్‌కు వచ్చాను. దయచేసి నాకు సహాయం చేయాలని భారత రాయబార కార్యాలయాన్ని అభ్యర్థిస్తున్నాను. నేను ఇక్కడ నేపాల్‌లోని పోఖ్రాలో చిక్కుకుపోయాను. నేను బస చేసిన హోటల్ దగ్ధమయ్యింది. వస్తువులన్నీ నా గదిలోనే ఉండిపోయాయి.హోటల్ మొత్తం తగలబడింది. నేను ప్రాణాలతో తప్పించుకోగలిగాను. ఇక్కడి పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ప్రతిచోటా రోడ్లపై మంటలు చెలరేగుతున్నాయి. ఆందోళనకారులు ఇక్కడి పర్యాటకులను విడిచిపెట్టడం లేదు. ప్రతిచోటా నిప్పు పెడుతున్నారు. దయచేసి మాకు సహాయం చేయండి. ఇక్కడ నాతోపాటు చాలా మంది ఉన్నారు’ అని  ఆ భారత మహిళ వీడియోలో మొరపెట్టుకున్నారు.

సోషల్ మీడియాపై  నిషేధానికి వ్యతిరేకంగా ప్రారంభమైన నిరసనలు ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలి నేతృత్వంలోని ప్రభుత్వ  అవినీతిపై తిరుగుబాటుగా మారాయి. సోమవారం రాత్రి ఆలస్యంగా సోషల్ మీడియాపై నిషేధం ఎత్తివేసినప్పటికీ, భారీ నిరసనల నేపథ్యంలో ప్రధాని ఓలి రాజీనామా చేశారు. ప్రదర్శనకారులు పలు ప్రభుత్వ భవనాలను ముట్టడించి, పార్లమెంటుతో పాటు పలువురు ఉన్నత స్థాయి అధికారుల ఇళ్లను తగలబెట్టారు. కాగా కాఠ్మండులోని భారత రాయబార కార్యాలయం.. నేపాల్‌లోని పరిస్థితులు చక్కబడే వరకూ ప్రయాణాలను వాయిదా వేయాలని కోరింది. 

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌