Breaking News

2028లో భారతీయ అంతరిక్ష స్టేషన్

Published on Wed, 12/03/2025 - 17:01

2028 సంవత్సరం నాటికి స్పేస్ లో  "భారతీయ అంతరిక్ష స్టేషన్" ఏర్పాటు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని కేంద్రం ప్రభుత్వం తెలిపింది.  పూర్తిగా స్వదేశీ సాంకేతికతతోనే  దీని నిర్మాణం చేపడుతున్నామని పార్లమెంటులో బుధవారం సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేందర్ సింగ్ పేర్కొన్నారు. దీనికి సంబంధించి తొలి మాడ్యూల్ ప్రక్రియ సజావుగా సాగుతుందని పేర్కొన్నారు.

భారతీయ అంతరిక్ష స్టేషన్ నిర్మాణ పనులు వేగవంతంగా సాగుతున్నాయని కేంద్రమంత్రి జితేందర్ సింగ్ తెలిపారు. దీనికి సంబంధించిన కీలమైన డిజైన్ మైల్ స్టోన్ ను ఇస్రో పూర్తిచేసిందన్నారు. దీని నిర్మాణం పూర్తయితే  భారత వ్యోమగాములు అంతరిక్ష ప్రయాణం, సాంకేతిక ప్రయోగాలు, పరిశోధనలు చాలా సులభతరమైతాయని వారు పేర్కొన్నారు. 

2024 సెప్టెంబర్ 1న భారతీయ అంతరిక్ష స్టేషన్ మెుదటి మాడ్యుల్ నిర్మాణానికి పార్లమెంట్ ఆమోదం తెలిపింది. దీనికి రూ.20,193 కోట్ల నిధులు కేటాయించగా 2028 వరకూ పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. 2035 నాటికి ఇది పూర్తిస్థాయిలో సేవలు అందించే అవకాశం ఉంది. 

భారతీయ అంతరిక్ష స్టేషన్ ఏర్పాటు పూర్తయితే  అమెరికా, రష్యా, చైనా దేశాల తర్వాత స్పేస్ లో స్వంత అంతరిక్ష స్టేషన్ కలిగిన నాలుగవ దేశంగా భారత్ రికార్టు సృష్టిస్తుంది.

#

Tags : 1

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)