Breaking News

లోకో పైలట్లకు పిడుగులాంటి వార్త.. ‘విరామం’ లేనట్లే!

Published on Wed, 04/09/2025 - 12:25

న్యూఢిల్లీ: భారతీయ రైల్వే(Indian Railways)లో విధులు నిర్వహిస్తున్న లోకో పైలట్లు తమకు డ్యూటీ సమయంలో భోజనం చేయడానికి, టాయిలెట్‌కు విరామ సమయం కావాలని సుదీర్ఘకాలంగా డిమాండ్‌ చేస్తున్నారు. అయితే తాజాగా లోకో పైలట్ల వినతిని రైల్వేశాఖ తిరస్కరించింది. దీంతో లోకో పైలట్లు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. రైల్వే బోర్డు ఈ నిర్ణయాన్ని బహుళ-విభాగాల కమిటీ సిఫార్సుల ఆధారంగా తీసుకుంది.

రైల్వే బోర్డుకు చెందిన ఐదుగురు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, రీసెర్చ్ డిజైన్స్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ (ఆర్‌డీఎస్‌ఓ) సభ్యుల కమిటీ లోకో పైలట్లకు విరామం ఇవ్వాలనే అంశంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ కమిటీ 2024, జూలైలో ఏర్పాటయ్యింది. లోకో పైలట్లు, గార్డుల ఫిర్యాదులను ఈ కమిటీ పరిశీలించింది. కాగా ఆల్ ఇండియా లోకో రన్నింగ్ స్టాఫ్ అసోసియేషన్(All India Loco Running Staff Association) (ఏఐఎల్‌ఆర్‌​ఎస్‌ఏ) సెక్రటరీ-జనరల్ కేసీ జేమ్స్, రైల్వే బోర్డు ఛైర్మన్/సీఈఓకు రాసిన ఒక లేఖలో ఈ కమిటీ రైలు వేగాన్ని 110 కిమీ/గం నుండి 130 కిమీ/గం వరకు పెంచిందని, ఫలితంగా లోకో పైలట్లపై పెరిగే ఒత్తిడి స్థాయిని అంచనా వేయడంలో విఫలమైందని  పేర్కొన్నారు. లోకోమోటివ్‌లలో టాయిలెట్ సౌకర్యం లేకపోవడం లోకో పైలట్లకు ఇబ్బందికరంగా మారిందని ఆయన ఆరోపించారు. ఈ నిర్ణయం లోకో పైలట్ల ఆరోగ్యం, రైళ్ల భద్రతపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆయన హెచ్చరించారు.

కాగా రైల్వే బోర్డు తన నిర్ణయాన్ని సమర్థించుకుంటూ రైళ్ల షెడ్యూల్‌ను నిర్వహించడం, ఆలస్యాలను నివారించడం కోసం ఈ చర్యలు  తప్పనిసరి అని పేర్కొంది. లోకోమోటివ్‌లలో టాయిలెట్ సౌకర్యాలను ఏర్పాటు చేయడం లేదా డ్యూటీ సమయంలో విరామాలను అనుమతించడం వల్ల రైళ్ల  రాకపోకలపై ‍ప్రభావం పడుతుందని బోర్డు పేర్కొంది. ఈ నిర్ణయాన్ని ఏఐఎల్‌ఆర్‌​ఎస్‌ఏ తీవ్రంగా ఖండించింది. లోకో పైలట్ల హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తామని ప్రకటించింది. ప్రస్తుతం రైల్వేలో 41,000 మందికి పైగా లోకో పైలట్లు ఉన్నారు. వీరిలో 1,828 మంది మహిళా లోకో పైలట్లు.

ఇది కూడా చదవండి: Delhi: సీఎంకు ‘శీష్‌ మహల్‌’ అడ్డంకి.. దక్కని అధికార నివాసం

Videos

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు