Breaking News

రిజర్వేషన్‌ కేంద్రాల్లో బుకింగ్‌లకూ ఇక ఓటీపీ 

Published on Thu, 12/04/2025 - 04:53

న్యూఢిల్లీ: చివరి నిమిషం ప్రయాణాలకు వరప్రదమైన తత్కాల్‌ టికెట్ల దుర్వినియోగానికి చెక్‌ పెట్టే దిశగా రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రిజర్వేషన్‌ కేంద్రాల వద్ద తత్కాల్‌ టికెట్ల కొనుగోలు చేసేందుకు వన్‌ టైమ్‌ పాస్‌ వర్డ్‌ (ఓటీపీ) వినియోగాన్ని తప్పనిసరి చేసింది. ప్రయాణికులు రిజర్వేషన్‌ ఫారంలో నింపే తమ మొబైల్‌ ఫోన్‌కు వచ్చే ఓటీపీని వెల్లడించి టికెట్‌ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ‘ఈ విధానాన్ని పైలట్‌ ప్రాజెక్టుగా ఇప్పటికే నవంబర్‌ 17వ తేదీ నుంచి ప్రయోగాత్మకంగా అమలు చేసి చూస్తున్నాం. ప్రస్తుతం కొన్ని రైళ్లకు మాత్రమే ప్రయోగాత్మకంగా దీనిని పరీక్షిస్తున్నాం. త్వరలో చాలా స్టేషన్లకు విస్తరిస్తాం.

 అనంతరం దేశమంతటా ఇదే విధానం అమల్లోకి వస్తుంది‘ అని రైల్వే శాఖ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. ‘‘ఓటీపీ అనుసంధాన తత్కాల్‌ టికెట్‌ కొనుగోలు ప్రక్రియను అమల్లోకి తెచ్చిన కారణంగా తత్కాల్‌ టికెట్ల అక్రమాలకు అడ్డుకట్ట పడుతుంది. తత్కాల్‌ టికెట్ల జారీలో పారదర్శకత మరింత పెరుగుతుంది’’ అని రైల్వేశాఖ పేర్కొంది. ఆన్‌లైన్‌లో తత్కాల్‌ బుకింగ్‌లకు ఆధార్‌ వెరిఫికేషన్‌ తప్పనిసరి చేస్తూ గత జూలైలో నిబంధన తెచ్చింది. బుకింగ్స్‌ మొదలైన తొలి 15 నిమిషాల్లో కేవలం ఆధార్‌ ధ్రువీకృత యూజర్లు మాత్రమే ఐఆర్‌సీటీసీ సైట్, యాప్‌ ద్వారా టికెట్‌ కొనుగోలు చేసేలా నిబంధనలు మార్చిన విషయం విదితమే.  
 

Videos

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు