Breaking News

కే4 బాలిస్టిక్‌ క్షిపణి పరీక్ష విజయవంతం

Published on Fri, 11/29/2024 - 05:42

న్యూఢిల్లీ: అణు సామర్థ్యం కలిగిన కే4 బాలిస్టిక్‌ క్షిపణిని భారత్‌ విజయవంతంగా పరీక్షించింది. విశాఖపట్నం తీరంలో అణు జలాంతర్గామి ఐఎన్‌ఎస్‌ అరిఘాత్‌ నుంచి భారత నావికాదళం ఆధ్వర్యంలో బుధవారం ఈ పరీక్ష చేపట్టినట్లు అధికార వర్గాలు గురువారం తెలిపాయి. కే4 బాలిస్టిక్‌ క్షిపణి 3,500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను సైతం ఛేదించగలదు. దేశంలో మొట్టమొదటిగా జలాంతర్గామి నుంచి నిర్వహించిన తొలి సబ్‌మెరైన్‌ లాంచ్డ్‌ బాలిస్టిక్‌ మిస్సైల్‌ ఇదే.

 ఈ క్షిపణి రాకతో మన దేశ అణ్వాయుధ సామర్థ్యం మరింత పెరిగినట్లు అధికారులు చెప్పారు. అణ్వాయుధ క్షిపణిని భూమి నుంచి, సముద్ర అంతర్భాగం నుంచి, నింగి నుంచి ప్రయోగించే సామర్థ్యం కలిగిన అతికొద్ది దేశాల జాబితాలో భారత్‌ కూడా చేరడం విశేషం. బాలిస్టిక్‌ క్షిపణులను ప్రయోగించే అణు జలాంతర్గాములు అమెరికా, రష్యా, యూకే, ఫ్రాన్స్, రష్యా వద్ద ఉన్నాయి. ఇప్పుడు భారత్‌ కూడా వీటిని సమకూర్చుకుంది.  

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)