Breaking News

ఈసారి ఐదున ఏం జరగబోతోంది? 

Published on Mon, 08/03/2026 - 04:58

సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజకీయాల్లో ఆగస్ట్‌ 5వ తేదీ కేలండర్‌లో ఒక సాధారణ రోజు కాదు. అదొక సంచలన నిర్ణయాలకు ప్రతీక. గతంలో ఇదే తేదీన తీసుకున్న చారిత్రక నిర్ణయాలు దేశ రాజకీయ స్వరూపాన్నే మార్చివేశాయి. సరిగ్గా అదే పంథాలో ఈసారి కూడా ఆగస్టు 5న కేంద్ర ప్రభుత్వం నుంచి మరో కీలక ప్రకటన రానుందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. ప్రస్తుతం పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు కొనసాగుతున్న తరుణంలో.. సరిగ్గా ఆగస్ట్‌ 5న ఒక కీలక బిల్లును సభలో ప్రవేశపెట్టేందుకు, దేశాన్ని విస్మయపరిచే సంచలన నిర్ణయాన్ని ప్రకటించేందుకు కేంద్రం రంగం సిద్ధం చేస్తోందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. 

దేశ రాజకీయ చరిత్రలో ఆగస్ట్‌ 5వ తేదీకి ఒక ప్రత్యేకమైన సెంటిమెంట్, వ్యూహాత్మక ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే.. 2019 ఆగస్ట్‌ 5న జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించేందుకు ఉద్దేశించిన ఆర్టీకల్‌ 370ను రద్దు చేస్తూ కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది.  అయోధ్య రామమందిర నిర్మాణానికి భూమిపూజ, శంకుస్థాపన కార్యక్రమం కూడా ఆగస్టు 5నే ఘనంగా జరిగింది. వర్షాకాల సమావేశాల నేపథ్యంలో బుధవారం ప్రభుత్వం ఎలాంటి సంచలనానికి తెరలేపుతుందనే దానిపై రాజకీయ పరిశీలకులు పలు రకాలుగా విశ్లేషిస్తున్నారు. సమూల పాలనా సంస్కరణలు, కీలకమైన సామాజిక, ఆర్థిక సంస్కరణలు లేదా అత్యంత ప్రతిష్టాత్మకమైన చట్టపరమైన సవరణలకు సంబంధించిన బిల్లును తెరపైకి తెచ్చే అవకాశం ఉందంటున్నారు. మరోవైపు, కేంద్ర కేబినెట్‌ పునర్వ్యవస్థీకరణపైనా పెద్ద చర్చ నడుస్తోంది.  
 

Videos

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)