Breaking News

కేరళ నర్సుకు మరణశిక్ష..భారత ప్రభుత్వం కీలక ప్రకటన

Published on Tue, 12/31/2024 - 11:12

న్యూఢిల్లీ:యెమెన్‌లో కేరళ నర్సు నిమిషప్రియ(36)కు మరణశిక్ష విధించిన అంశంలో భారత విదేశాంగశాఖ స్పందించింది. ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్‌ జైశ్వాల్ తెలిపారు. నిమిష కుటుంబ సభ్యులకు అవసరమైన సహాయం అందించడానికి భారత ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వెల్లడించారు.

యెమెన్‌ జాతీయుడి హత్య కేసులో కేరకు చెందిన నర్సు నిమిష ప్రియ నిందితురాలిగా ఉన్నారు. యెమెన్ అధ్యక్షుడు రషద్‌ అల్ అలిమి ఇటీవలే నిమిష మరణశిక్షను ధృవీకరించారు. ఈ శిక్షను నెల రోజులలోపు అమలు చేసే అవకాశం ఉంది. ఈ కేసులో నిమిష మరణశిక్ష రద్దు చేయించేందుకు ఆమె తల్లి ప్రేమకుమారి చేసిన శ్రమంతా అధ్యక్షుడి నిర్ణయంతో వృథా అయింది.

ఈ ఏడాది మొదట్లోనే యెమెన్‌ వెళ్లిన నిమిష తల్లి అప్పటినుంచి ఇదే పని మీద అక్కడే ఉంటున్నారు. ఇక నిమిషను శిక్ష నుంచి కాపాడే శక్తి ఆమె చేతిలో హత్యకు గురైన కుటుంబ సభ్యులు, గిరిజన నేతల చేతిలోనే ఉంది. వారు క్షమాభిక్ష పెడితేనే నిమిష మరణశిక్ష నుంచి బయటపడుతుంది.

నిమిషప్రియ 2017లో జరిగిన యెమెన్‌ జాతీయుడు అబ్దో మెహదీ  హత్య కేసులో యెమెన్‌లో అరెస్టయ్యారు. ఆ తర్వాత సంవత్సరానికి ఆమెను ఈ కేసులో దోషిగా తేల్చిన కోర్టు మరణశిక్ష విధించింది. అనంతరం సుప్రీంకోర్టు నిమిష అప్పీల్‌ను తిరస్కరించింది. తాజాగా అధ్యక్షుడు ఆమె మరణశిక్షను ధృవీకరించారు.

ఇదీ చదండి: క్లాస్‌మేట్‌ను చంపిన టీనేజర్‌కు జీవితఖైదు 

Videos

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)