Breaking News

జమ్మూలో 30 మంది ఉగ్రవాదులు?

Published on Sun, 12/28/2025 - 19:47

జమ్మూ కశ్మీర్‌లోకి అక్రమంగా దాదాపు 30 మంది ఉగ్రవాదులు చొరబడ్డారని నిఘా సంస్థలు హెచ్చరించడంతో ఆ ప్రాంతంలో సైన్యం నిఘాను పెంచింది. 'చిల్లై కలాన్'( అత్యంత చలిఉండే కాలం)ను సైతం లెక్కచేయకుండా డ్రోన్లు, థర్మల్ ఇమేజర్లు తదితర ఎలక్ట్రానిక్ పరికరాలతో భద్రత సంస్థలు నిరంతరం నిఘాను పెంచుతున్నాయి.  

జమ్ముకశ్మీర్‌లోని వాతావరణ పరిస్థితుల గురించి ప్రత్యేకంగా చెప్పల్సిన అవసరం లేదు. సాధారణ సమయంలోనే ఎముకలు గడ్డకట్టే చలి ఉండే  ఆ ప్రాంతంలో ఇక చలికాలం ఆ ప్రభావం ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. డిసెంబర్ 21 నుంచి జనవరి 31 వరకూ మధ్య కాలాన్ని (చిల్లైకలాన్) అత్యంత కఠినమైన చలి ఉండే కాలం ప్రారంభమవుతోంది. ఈ సమయంలో అక్కడ విపరీతమైన మంచు కురుస్తుంది. నదులు, సరస్సులు, గడ్డకట్డి పోతాయి. ఉష్ణోగ్రతలు మైనస్ 10 డిగ్రీలకు చేరుకుంటాయి.

ఇటువంటి సమయంలో అక్కడ జీవించడమే అత్యంత కష్టమైన పని కానీ భారత ఆర్మీ ఉగ్రవాదుల నుంచి దేశాన్ని కాపాడడం కోసం కఠినమైన ఆపరేషన్‌ చేపడుతుంది. జమ్మూ రీజియన్‌లో ముష్కరులకు ఎటువంటి సహాయం అందకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తోంది. సున్నిత ప్రాంతాలలో సైనికుల మోహరింపును పెంచింది. కొండలు, ‍అడవులు, మారుమూల లోయ గ్రామాలను జల్లెడ పడుతోంది. గుల్మార్ల్, సోనాలేక్, థాల్‌ సరస్సు వంటి సమస్యత్మాక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఉంచింది.

అంతేకాకుండా ఉగ్రవాదులు సహాయం పొందే అవకాశాలున్న ప్రాంతాల్లో భద్రత పెంచింది. కఠినమైన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో సైన్యం కొద్దిగా వెనక్కి తగ్గితే ఉగ్రవాదులకు అవకాశం ఇచ్చినట్లనే ఉద్దేశంతో జమ్మూకశ్మీర్‌ రీజన్‌లో నిరంతర నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. 
 

Videos

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)