Breaking News

ఆకాశ్‌ ప్రైమ్‌ పరీక్ష విజయవంతం

Published on Thu, 07/17/2025 - 06:08

న్యూఢిల్లీ: భారత స్వదేశీ తయారీ గగనతల రక్షణ వ్యవస్థను మరింత పటిష్టంచేసేలా ఆకాశ్‌ ప్రైమ్‌ క్షిపణి పరీక్ష విజయవంతమైందని భారత రక్షణ శాఖ వర్గాలు బుధవారం ప్రకటించాయి. సముద్రమట్టానికి 15,000 అడుగుల ఎత్తులో లద్దాఖ్‌లో భూతలం నుంచి గగనతల లక్ష్యాలను చేధించే ఆకాశ్‌ ప్రైమ్‌ క్షిపణిని విజయవంతంగా పరీక్షించామని రక్షణ వర్గాలు తెలిపాయి. క్షిపణిని అభివృద్ధి చేసిన రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థ(డీఆర్‌డీఓ) సహకారంతో లద్దాఖ్‌ సెక్టార్‌లో ఈ ప్రయోగపరీక్షలు పూర్తయ్యాయి.

 గగనంలో వేగంగా భిన్న దిశల్లో కదిలే రెండు లక్ష్యాలను ఆకాశ్‌ ప్రైమ్‌ మిస్సైల్‌ అత్యంత ఖచ్చితత్వంతో చేధించింది. అననుకూల వాతావరణంలోనూ పూర్తి సమర్థతతో పనిచేసి క్షిపణి తన సత్తా చాటింది. భారత సైన్యంలోని మూడో, నాలుగో ఆకాశ్‌ రెజిమెంట్‌లో ఈ కొత్త ఆకాశ్‌ ప్రైమ్‌ క్షిపణులను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఆపరేషన్‌ సిందూర్‌ వేళ పాకిస్తాన్‌ నుంచి దూసుకొచ్చిన డ్రోన్లు, క్షిపణులను ఆ ఆకాశ్‌ ప్రైమ్‌ క్షిపణి విజయవంతంగా అడ్డుకుని ఇప్పటికే తన సమర్థతను నిరూపించుకుంది. ఆనాడు పాకిస్తాన్‌కు చైనా తయారీ యుద్ధవిమానాలు, ఇజ్రాయెల్‌ సరఫరా చేసిన డ్రోన్ల నుంచి పొంచి ఉన్న ముప్పును ఆకాశ్‌ ప్రైమ్‌ క్షిపణులు తప్పించాయని రక్షణ వర్గాలు పేర్కొన్నాయి. 

Videos

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)