Breaking News

పాకిస్తాన్‌తో యుద్ధం.. ఆర్మీ అధికారుల మీడియా సమావేశం లైవ్‌

Published on Sat, 05/10/2025 - 11:01

సాక్షి, ఢిల్లీ: పాకిస్తాన్‌ రెచ్చగొట్టే చర్యలకు దిగింది. భారత్‌లోని 26 ప్రదేశాల్లో పాక్‌ దాడులకు తెగబడిందని ఆర్మీ అధికారులు తెలిపారు. పాక్‌ దాడులను భారత్‌ సమర్ధవంతంగా తిప్పికొట్టిందని స్పష్టం చేశారు. ఆపరేషన్‌ సిందూర్‌పై విదేశాంగ శాఖ, రక్షణ శాఖ సంయుక్త సమావేశంగా మీడియా సమావేశం నిర్వహించింది. ఆపరేషన్‌ సిందూర్‌పై అధికారులు వివరాలను వెల్లడించారు. 

ఉద్రిక్తతలపై తాజా పరిస్థితులను కర్నల్‌ సోఫియా ఖురేషి వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పాక్‌ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోంది. దాడులతో ఉద్రిక్తతలు పెంచుతోంది. వాటిని భారత సైన్యం సమర్థంగా తిప్పికొడుతోంది. శ్రీనగర్‌, ఉధంపూర్‌, బటిండాలో దాడులు జరుపుతోంది. పలు చోట్ల పాఠశాలలు, వాయుసేన ఆసుపత్రులపై కూడా దాడులు చేస్తోంది. భుజ్‌, బటిండాలోని ఎయిర్‌స్టేషన్లలపై పాక్‌ దాడి చేసింది. లాంగ్‌ రేంజ్‌ క్షిపణులు, యుద్ధ విమానాలు, డ్రోన్లతో పాకిస్తాన్‌ దాడులు చేస్తోంది. పాక్‌ దాడులను భారత్‌ ధీటుగా తిప్పి కొడుతోంది. పాకిస్తాన్‌ పశ్చిమ ప్రాంతంలో క్షిపణులతో దాడికి దిగింది. యుద్ధ విమానాలు, డ్రోన్లతో దాడులు చేస్తోంది.పాకిస్తాన్‌ మిస్సైల్స్‌ను భారత వాయుసేన తిప్పి కొట్టింది. పాక్‌ ఎయిర్‌బేస్‌లను గట్టిగా దెబ్బతీశాం. సోషల్‌ మీడియాలో పాక్‌ తప్పుడు ప్రచారం చేస్తోంది. పాక్‌ దాడులను పూర్తి స్థాయిలో తిప్పికొట్టాం. పాక్‌ దాడులు చేసిన ప్రతీచోటా భారత్‌ గట్టిగా ప్రతిఘటించింది. పాకిస్తాన్‌ హైస్పీడ్‌ మిస్సైల్‌ మోర్టార్‌లను ప్రయోగించిందన్నారు. 

 

 

వింగ్ కమాండర్ ఒమికా సింగ్‌ మాట్లాడుతూ.. పాకిస్తాన్ రెచ్చగొట్టే చర్యలను కొనసాగిస్తోంది. డ్రోన్స్, లాంగ్ రేంజ్ మిస్సైల్స్ ఉపయోగిస్తుంది. పటాన్ కోట్ , ఉడంపూర్, బూజ్ ప్రాంతాలపై దాడికి దిగింది. పాకిస్తాన్ దాడులను తిప్పి కొట్టాం. భారత్ కేవలం పాకిస్తాన్ మిలిటరీ కేంద్రాలను టార్గెట్ చేసి దాడులు చేసింది. పాకిస్తాన్ తప్పుడు ప్రచారం చేస్తోంది. భారత్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లకు ఎలాంటి హాని జరగలేదు అని అన్నారు.

 

విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రి మాట్లాడుతూ.. భారత్ ఎస్ 400 ధ్వంసం చేశారన్న వార్తలు అవాస్తవం. సిరాసా, సూరత్ ఘడ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్స్‌కు ఎలాంటి నష్టం జరగలేదు. పాకిస్తాన్ సామాన్య ప్రజలపై దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో ఒక అధికారి చనిపోయారు’ అని తెలిపారు. 
 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)