Breaking News

ఉగ్రవాదుల ఏరివేత.. జమ్ములో సైనికుల మోహరింపు

Published on Sat, 07/20/2024 - 10:05

జమ్ము ప్రాంతంలో  ఉగ్రవాద కార్యకలాపాలు పెరుగుతున్న నేపధ్యంలో ఆ ప్రాంతంలో అత్యధిక సంఖ్యలో సైనికులను మోహరించారు. జమ్ములో ఉగ్రవాదులను ఏరివేసేందుకు ఇంటర్ కమాండ్‌లో మార్పులు చేశారు. కథువా, సాంబా, దోడా, బదర్వా, కిష్త్వార్‌లలో సైనికుల సంఖ్యను మరింతగా పెంచారు. వెస్ట్రన్ కమాండ్ నుండి కూడా ఇక్కడకు సైనికులను పంపారు.

గత సోమవారం జమ్ముకశ్మీర్‌లోని దోడా జిల్లాలో పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మహ్మద్‌కు చెందిన సాయుధ ఉగ్రవాదులతో జరిగిన భీకర ఎన్‌కౌంటర్‌లో కెప్టెన్‌తో సహా నలుగురు ఆర్మీ జవాన్లు వీరమరణం పొందారు. మూడు వారాల్లో జమ్మూ ప్రాంతంలో ఇది మూడో అతిపెద్ద ఉగ్రవాద ఘటన. దీనికి ముందు కథువా జిల్లాలో ఉగ్రవాదులు ఆర్మీ పెట్రోలింగ్ వాహనంపై మెరుపుదాడి చేశారు. ఈ ఘటనలో ఐదుగురు సైనికులు వీరమరణం పొందారు.  అంతేసంఖ్యలో సైనిక సిబ్బంది గాయపడ్డారు.

అంతకుముందు జూలై 9న కిష్త్వార్ జిల్లా సరిహద్దుల్లోని అడవుల్లో భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్ తర్వాత ఉగ్రవాదులు పారిపోయారు. జూన్ 26న  గండో ప్రాంతంలో ఒక రోజంతా జరిగిన ఆపరేషన్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. అదేవిధంగా జూన్ 12న జరిగిన భీకర కాల్పుల్లో ఐదుగురు ఆర్మీ సిబ్బంది, ఒక ప్రత్యేక పోలీసు అధికారి గాయపడటంతో దోడాలో ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలు ముమ్మరం చేశారు.

గండోలో జరిగిన మరో ఎన్‌కౌంటర్‌లో ఒక పోలీసు గాయపడ్డాడు. 2005- 2021 మధ్య భద్రతా దళాలు ఉగ్రవాదాన్ని నిర్మూలించిన తర్వాత జమ్ము ప్రాంతం సాపేక్షంగా శాంతియుతంగా ఉంది. అయితే ఈ ప్రాంతంలో గత నెల నుంచి ఉగ్రవాద దాడులు పెరిగాయి. ఇటీవల యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సుపై జరిగిన దాడిలో తొమ్మిది మంది మృతిచెందగా, 40 మంది గాయపడ్డారు.

Videos

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినానో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)