Breaking News

రోడ్డుపై వైమానిక గర్జన

Published on Sat, 05/03/2025 - 02:40

షాజహాన్‌పూర్‌ (యూపీ): పహల్గాం దాడి ఉద్రిక్తతల నేపథ్యంలో గురువారం నాటి పాకిస్తాన్‌ సైనిక విన్యాసాలకు మన సైన్యం దీటుగా బదులిచి్చంది. సంప్రదాయ యుద్ధక్షేత్రాలకు భిన్నంగా నడిరోడ్డుపైనా యుద్ధవిమానాల ల్యాండింగ్, టేకాఫ్‌ జరిపి వాయుసేన సత్తా చాటింది. అత్యంత అధునాతన శత్రు భీకర రఫేల్‌తో పాటు సుఖోయ్‌–30, ఎంకేఐ, మిరాజ్‌–2000, మిగ్‌–29, జాగ్వార్, సీ–130జే సూపర్‌ హెర్క్యులస్, ఏఎన్‌–32 విమానాలతో పాటు ఎంఐ–17 వీ5 హెలికాప్టర్లను కూడా ఈ అధునాతన ఎయిర్ర్‌స్టిప్‌పై ల్యాండింగ్, టేకాఫ్‌ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌ జిల్లాలోని గంగా ఎక్స్‌ప్రెస్‌వే ఈ ఒళ్లు గగుర్పొడిచే విన్యాసాలకు వేదికైంది. 

పగటి పూటే గాక అవసరమైతే కారుచీకట్లోనూ నిర్భీతిగా యుద్ధవిమానాలను రోడ్లపై కూడా దింపగలమని వాయుసేన నిరూపించింది. 594 కిలోమీటర్ల పొడవైన గంగా ఎక్స్‌ప్రెస్‌ వేలో జలాలాబాద్‌ సమీపంలోని పిరూ గ్రామం వద్ద నిర్మించిన 3.5 కిలోమీటర్ల పొడవైన ఎయిర్‌్రస్టిప్‌పై శుక్రవారం రాత్రి ఎయిర్‌ఫోర్స్‌ యుద్ధవిమానాలు ఇలా ల్యాండై అలా టేకాఫ్‌ తీసుకున్నాయి. తద్వారా దేశంలో పగలు, రాత్రి తేడా లేకుండా అన్నివేళలా ఫైటర్‌జెట్ల ల్యాండింగ్, టేకాఫ్‌కు అనువైన తొలి ఎక్స్‌ప్రెస్‌వే గా ఈ మార్గం నిలిచింది. 

తొలిసారిగా శుక్రవారమే పరీక్ష 
గంగా ఎక్స్‌ప్రెస్‌ వే ఎయిర్‌్రస్టిప్‌ను శుక్రవారమే తొలిసారిగా పరీక్షించారు. ఎయిర్‌ఫోర్స్‌ విభాగంలోని టాప్‌ ఫైటర్లు దీన్ని వినియోగించాయి. గంగా ఎక్స్‌ప్రెస్‌ వే ఇప్పటికే 85 శాతం నిర్మాణం పూర్తయింది. యూపీలో ఆగ్రా–లఖ్‌నవూ, పూర్వాంచల్, బుందేల్‌ఖండ్‌ ఎక్స్‌ప్రెస్‌ వేల మీదా ఎయిర్‌స్ట్రిప్‌లను నిర్మించారు.

గంగా ఎక్స్‌ప్రెస్‌ వే మీద మాత్రమే ప్రస్తుతానికి రాత్రివేళ ఆపరేషన్‌కు అనువుగా అధునాతన లైటింగ్, నావిగేషన్‌ వ్యవస్థలను సిద్ధంచేశారు. ఈ ఎయిర్ర్‌స్టిప్‌ను సంఘవ్యతిరేక శక్తులు పాడుచేయకుండా కనిపెట్టేందుకు 250కి పైగా సీసీటీవీ కెమెరాలను అమర్చారు. ఎయిర్‌్రస్టిప్‌ పరీక్షను స్వయంగా తిలకించేందుకు సమీప గ్రామాల ప్రజలు, వందలాది మంది పాఠశాల విద్యార్థులు వచ్చారు. రక్షణ శాఖ, యూపీ రాష్ట్ర అధికారులు కూడా               కార్యక్రమంలో పాల్గొన్నారు.

రోజంతా చక్కర్లు 
రాత్రిపూట ల్యాండింగ్, టేకాఫ్‌కు ముందు పగటిపూట యుద్ధ విమానాలను ఎయిర్ర్‌స్టిప్‌పై చాలాసార్లు విజయవంతంగా దింపారు. యుద్ధ సమయాల్లో వైమానిక స్థావరాలు, రన్‌వేలను శత్రు విమానాలు ధ్వంసం చేస్తే అత్యవసరంగా యుద్ధ విమానాలను దించడానికి, మళ్లీ సమరానికి సిద్ధమై వెనువెంటనే టేకాఫ్‌ తీసుకోవడానికి వీలుగా ఎక్స్‌ప్రెస్‌ వేలపై ఇలా ఎయిర్‌్రస్టిప్‌లను నిర్మిస్తున్నారు. యుద్ధ సమయాల్లో సైనికులు, ఆయుధాలు, సైనిక ఉపకరణాలను మోసుకెళ్లే భారీ సరకు రవాణా విమానాలు సైతం దిగేలా వాటిని అత్యంత పటిష్టంగా నిర్మించారు.

ఈ ఎయిర్‌్రస్టిప్‌ను అత్యంత అరుదుగా మాత్రమే వాడే అవకాశం ఉందని తెలిసి కూడా మన్నిక, నాణ్యతలో ఏమాత్రం రాజీపడకుండా అధునాతన ఇంజనీరింగ్‌ నైపుణ్యంతో నిర్మించారు. అందుకు క్యాట్‌–2 ఇన్‌స్ట్రుమెంట్‌ ల్యాండింగ్‌ సిస్టమ్‌ సాంకేతికతను వినియోగించారు. మంచు, వర్షం, పొగమంచు, తక్కువ దృగ్గోచరత వంటి సందర్భాల్లోనూ ల్యాండింగ్, టేకాఫ్‌ సాధ్యమయ్యేలా ఎక్స్‌ప్రెస్‌ వేలో ఎత్తయిన, అనువైన ప్రదేశంలోనే స్ట్రిప్‌ను నిర్మించారు. వరదలు, భూకంపం వంటి విపత్తుల వేళ సైన్యాన్ని వెంటనే రంగంలోకి దించడానికీ ఈ స్ట్రిప్‌ ఉపయోగపడనుంది. అత్యంత తక్కువ ఎత్తులో దూసుకొస్తూ ల్యాండింగ్‌నూ పరీక్షించారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)