Breaking News

పాకిస్తాన్‌కు చుక్కలే.. రష్యాకు భారత ప్రభుత్వం విజ్ఞప్తి

Published on Wed, 05/14/2025 - 07:11

న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత ఆపరేషన్‌ సిందూర్‌లో భాగంగా పాకిస్తాన్‌ డ్రోన్లు, క్షిపణులను సమర్థంగా తిప్పికొట్టడంలో ఎస్‌–400 గగనతల రక్షణ వ్యవస్థలు కీలకంగా పనిచేశాయి. రష్యా నుంచి కొనుగోలు చేసిన ఈ వ్యవస్థలు ‘సుదర్శన చక్ర’గా భారతదేశ రక్షణ శాఖకు తురుపుముక్కగా మారాయి. శత్రుదేశాల క్షిపణులను నేలకూల్చడంలో వీటికి తిరుగులేదు.

ఈ నేపథ్యంలో మరిన్ని ఎస్‌–400 ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్స్‌ అందజేయాలని రష్యాకు భారత ప్రభుత్వం తాజాగా విజ్ఞప్తి చేసింది. అత్యంత విశ్వసనీయ వర్గాలు ఈ విషయం వెల్లడించాయి. భారత్‌ వినతిని అతిత్వరలోనే రష్యా అంగీకరించే సూచనలు కనిపిస్తున్నట్లు తెలిపాయి. ఇటీవలి పరిణామాల తర్వాత గగనతల రక్షణ వ్య వస్థలను మరింత బలోపేతం చేసుకోవాలని భారత ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. రష్యా నుంచి ఐదు ఎస్‌–400 ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థల కొనుగోలు కోసం 2018లో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ డీల్‌ విలువ 5.43 బిలియన్‌ డాలర్లు. 2021 నుంచి దశలవారీగా ఐదు వ్యవస్థలు రష్యా నుంచి భారత్‌కు చేరుకున్నాయి.   

ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్
ఎస్‌-400 ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైన మొబైల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. దీన్ని సులభంగా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించేందుకు అవకాశం ఉంటుంది. దాన్ని ఓ వాహనంపై అమర్చవచ్చు. ఒకేసారి మల్టిపుల్‌ టార్గెట్స్‌ని ధ్వంసం చేస్తుంది. ఒకేసారి 36 టార్గెట్‌లను ట్రాక్‌ చేసే సామర్థ్యం దీనికి ఉంది. అలాగే, 12 టార్గెట్స్‌పై ఒకే సారి దాడి చేస్తుంది. 600 కిలోమీటర్ల దూరం నుంచే ట్రాక్‌ చేస్తూ.. 400 కిలోమీటర్ల పరిధిలోనే శత్రువుల మిస్సైల్స్‌ను కూల్చే సత్తా వీటి సొంతం. విమానాలు, డ్రోన్లు, క్రూయిజ్ మిసైల్స్‌, బాలిస్టిక్ మిసైల్స్‌ ఇలా వేర్వేరు లక్ష్యాలను ఒకేసారి టార్గెట్‌ చేసి ఛేదిస్తుంది. వీటిని రియాక్షన్‌ టైమ్‌ చేలా వేగంగా ఉంటుంది. ఎస్‌-400 యాంటీ మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్‌ను ఫైర్‌ చేసేందుకు ఐదు నిమిషాల్లోనే రెడీ చేయొచ్చు. ఇందులో 3డీ ఫేజ్‌డ్ అరే రాడార్‌ ట్రాకింగ్ సిస్టమ్‌ ఉంటుంది.

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)