అమల్లోకి భారత్, యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం 

Published on Thu, 07/16/2026 - 05:44

న్యూఢిల్లీ: భారత్, యునైటెడ్‌ కింగ్‌డమ్‌(యూకే) మధ్య సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం(సెటా)బుధవారం అమల్లోకి వచ్చింది. ఇది యూకేకు జరిగే భారత ఎగుమతుల్లో దాదాపు 99 శాతానికి సుంకం లేని ప్రవేశాన్ని కల్పించడంతోపాటు రెండు దేశాల నడుమ వాణిజ్యం, పెట్టుబడులు, సేవల రంగాల్లో సంబంధాలను బలోపేతం చేయనుంది. యూకేలోకి ప్రవేశించే భారతీయ ఉత్పత్తుల్లో 99 శాతం, భారత్‌లోకి ప్రవేశించే యూకే ఉత్పత్తుల్లో 90 ఉత్పత్తులకు సున్నా సుంకం వర్తిస్తుంది. 

కొన్నింటిపై సంకాలు తగ్గుతాయి. ఇది ఆటోమోటివ్, తయారీ, వినియోగ వస్తువులు, సృజనాత్మక పరిశ్రమలు, వైద్య సాంకేతికతతో సహా ఇరువైపులా అనేక రంగాలకు ప్రయోజనం చేకూరుస్తుంది. వ్రస్తాలు, తోలు, రత్నాలు, ఆభరణాలు, ఇంజనీరింగ్‌ వస్తువులు, సముద్ర ఉత్పత్తులు, ఔషధాలు, ప్రాసెస్‌ చేసిన ఆహారంతో సహా పలు రంగాల్లో సుంకాలు భారీగా తగ్గుతాయి. ‘సెటా’తో పాటు సామాజిక భద్రత ఒప్పందం (ద్వంద్వ సహకార ఒప్పందం) కూడా అమల్లోకి వచ్చింది. 

వాణిజ్య ఒప్పందంలో భాగంగా బుధవారం నుంచే స్కాచ్‌ విస్కీపై దిగుమతి సుంకాన్ని 150 శాతం నుంచి 75 శాతానికి తగ్గించారు. భారత్‌–యూకే సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందంతోపాటు సామాజిక భద్రతా ఒప్పందం అమల్లోకి రావడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం హర్షం వ్యక్తంచేశారు. ఇది ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో ఒక కీలక ఘట్టంగా అభివరి్ణంచారు.

 భారత్, యూకే మధ్య ఆర్థిక సంబంధాలు మరింత బలపడతాయని, ఉమ్మడి ఆశయాలు ప్రజలకు ప్రయోజనకరమైన అవకాశాలుగా మారుతాయని వెల్లడించారు. వాణిజ్య ఒప్పందం రైతులు, పారిశ్రామికవేత్తలు, ఎంఎస్‌ఎంఈలకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని, అలాగే పలు కీలక రంగాలు యూకే మార్కెట్‌లోకి సులభంగా ప్రవేశం పొందుతాయని పేర్కొన్నారు. నైపుణ్యం కలిగిన భారతీయ ప్రతిభావంతులకు మరింత మేలు జరుగుతుందని, రెండు దేశాల మధ్య సాంకేతికత, ఆవిష్కరణ రంగాల్లో పరస్పర సహకారం పెరుగుతుందని ఉద్ఘాటించారు.    
 

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)