బ్రిటన్‌తో వాణిజ్య ఒప్పందం ఏప్రిల్‌ నుంచి అమల్లోకి 

Published on Mon, 02/16/2026 - 06:29

న్యూఢిల్లీ: భారత్, బ్రిటన్‌ మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఏప్రిల్‌ నుంచి అమల్లోకి రానుంది.  ఈ ఒప్పందం ఏప్రిల్‌ నుంచి అమల్లోకి వస్తుందని ఆశిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. గతేడాది జూలై 24న ఇరు దేశాలు సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం (సీఈటీఏ)పై సంతకం చేశాయి.  2030 నాటికి 56 బిలియన్‌ డాలర్ల వాణిజ్యాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యంగా ఈ ఒప్పందం జరిగింది.  

ఇది అమల్లోకి వస్తే చాక్లెట్లు, బిస్కెట్లు, సౌందర్య సాధనాలు వంటి వస్తువులపై సుంకాలు తగ్గనున్నాయి. అంతేకాదు స్కాచ్‌ విస్కీపై 150 శాతం ఉన్న సుంకం 75 శాతానికి తగ్గనుంది. 2035 నాటికి 40 శాతానికి  తగ్గిస్తారు. ప్రస్తుతం 110శాతం ఉన్న సుంకాలను రానున్న ఐదేళ్లలో 10శాతానికి తగ్గించనున్నారు.

 ఇవన్నీ దశలవారీగా అమలు కానున్నాయి. ఇక భారత్‌కు చెందిన వ్రస్తాలు, పాదరక్షలు, రత్నాలు–నగలు, క్రీడా సామగ్రి, బొమ్మలు వంటి ఉత్పత్తులను యూకేకు ఎగుమతి చేయడానికి అవకాశం ఉంటుంది. వ్యవసాయ ఉత్పత్తులను కూడా పన్నుల సుంకాలు లేకుండా ఎగుమతి చేసే లభించనుంది.  ఈ ఒప్పందంతో దేశంలోని చిన్న, సన్నకారు రైతులకు ప్రయోజనం కలుగుతుందని భావిస్తున్నారు. 

యూకే పార్లమెంట్‌ ఆమోదం తర్వాతే... 
అయితే ఈ ఒప్పందం  అమలు కావడానికి ముందు యూకే పార్లమెంట్‌ ఆమోదం పొందాల్సి ఉంది. ఇటీవల యూకే పార్లమెంట్‌లోని హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌ ఈ ఒప్పందంపై చర్చించింది. ఈ సందర్భంగా వాణిజ్య శాఖ మంత్రి క్రిస్‌ బ్రయంట్‌ మాట్లాడారు. ఈ ఒప్పందం ఇరు దేశాల మధ్య చారిత్రాత్మక విజయమన్నారు.  ఈ ఒప్పందాన్ని అమలు చేయడానికి ముందు రెండు సభల్లో చర్చలు, సమీక్షలు నిర్వహిస్తాయని తెలిపారు.  

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)