'అగ్ని 5' బాలిస్టిక్ క్షిపణి పరీక్ష సక్సెస్‌

Published on Wed, 08/20/2025 - 21:05

భారత్ 'అగ్ని 5' బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఒడిశాలోని చాందీపుర్‌ ఇంటిగ్రేటెడ్‌ టెస్ట్‌ రేంజ్‌ నుంచి ఈ ప్రయోగం జరిగింది. ఇది అణు సామర్థ్యం ఉన్న స్వదేశీ క్షిపణి. ఇది రక్షణ రంగంలో దేశానికి ఉన్న బలమైన సామర్థ్యాన్ని మరోసారి చాటుకుంది.

ఈ పరీక్షను డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీవో) నిర్వహించింది. ఒకేసారి బహుళ లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యం గల 'అగ్ని 5' ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణి 5 వేల కిలోమీటర్ల వరకు లక్ష్యాలను ఛేదించగలదు.

మూడు దశల ఘన ఇంధన ఇంజిన్‌ను కలిగి ఉన్న ఈ క్షిపణి.. ఇది భారత సరిహద్దులను మరింత సురక్షితం చేస్తుంది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ అధునాతన క్షిపణిని ‘మల్టీపుల్‌ ఇండిపెండెంట్‌ టార్గెటబుల్‌ రీ-ఎంట్రీ వెహికల్‌’ సాంకేతికతతో రూపొందించారు. దీనిద్వారా ఒకే క్షిపణి సాయంతో అనేక వార్‌ హెడ్లను వేర్వేరు లక్ష్యాలపై ప్రయోగించవచ్చు. ఈ ఏడాది జులైలో అగ్ని-1 బాలిస్టిక్‌ క్షిపణిని పరీక్షించారు.
 

Videos

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)