Breaking News

ప్రళయ్‌ క్షిపణి ప్రయోగం సక్సెస్‌ 

Published on Thu, 01/01/2026 - 05:35

న్యూఢిల్లీ: శత్రు భీకర ప్రళయ్‌ క్షిపణులను రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) విజయవంతంగా పరీక్షించింది. బుధవారం ఒడిశా తీర సమీపంలో రెండు క్షిపణులను వెంటవెంటనే ప్రయోగించినట్టు సంస్థ వెల్లడించింది. ప్రళయ్‌ 150 నుంచి 500 కి.మీ.ల స్వల్ప శ్రేణి సర్ఫేస్‌ టు సర్ఫేస్‌ క్షిపణి. 500 నుంచి 1,000 కిలోల సంప్రదాయ పేలోడ్‌ను మోసుకెళ్లగలదు. 

మేకిన్‌ ఇండియా మిషన్‌లో భాగంగా దీన్ని పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతోనే రూపొందించడం విశేషం. పూర్తిస్థాయి కచ్చితత్వం ప్రళయ్‌ క్షిపణుల ప్రత్యేకత. ఇందులో అమర్చిన అత్యాధునిక నావిగేషన్‌ వ్యవస్థే అందుకు కారణం. పరీక్షను విజయవంతం చేసినందుకు డీఆర్‌డీఓ, వాయుసేన, సైన్యంతో పాటు ప్రభుత్వ రంగ రక్షణ సంస్థలకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ అభినందనలు తెలిపారు. ప్రళయ్‌ క్షిపణిని డీఆర్‌డీఓతో పాటు పలు రక్షణరంగ సంస్థలతో కలిసి రీసెర్చ్‌ సెంటర్‌ ఇమారత్‌ రూపొందించింది.  

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)