Breaking News

సింధూ నీళ్లు చుక్క కూడా ఇవ్వం.. పాక్‌కు భారత్‌ కౌంటర్‌

Published on Sun, 06/01/2025 - 11:50

ఢిల్లీ: దాయాది దేశం పాకిస్తాన్‌కు భారత్‌ ఎప్పటికప్పుడు వరుస షాక్‌లు ఇస్తూనే ఉంది. పహల్గాం ఘటన తర్వాత పాక్‌కు చుక్కలు చూపిస్తోంది. ఇటు దౌత్యపరంగా కూడా పాకిస్తాన్‌ను ముప్పు తిప్పలు పెడుతోంది. తాజాగా సింధూ జలాల విషయంలో మరోసారి పాక్‌కు భారత్‌ ఝలక్‌ ఇచ్చింది. పాక్‌ ప్రేరేపిత సీమాంతర ఉగ్రవాదం అనేది సింధూ నదీ జలాల ఒప్పందం అమలులో జోక్యంతో సమానమని భారత్ స్పష్టం చేసింది. ఈ ఒప్పందం అమలు విషయంలో తమ దేశాన్ని నిందించడం మానేయాలని పాక్‌కు హితవు పలికింది.

కాగా, తజికిస్తాన్‌లోని దుషాన్‌బే నగరం వేదికగా హిమానీ నదాలపై ఐక్యరాజ్యసమితి తొలి సదస్సు ప్లీనరీ సెషన్‌ జరిగింది. ఈ కార్యక్రమంలో భారత్‌, పాకిస్తాన్‌కు సహా పలు దేశాలు పాల్గొన్నాయి. ఈ సదస్సులో పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ మాట్లాడుతూ..‘సింధూ నదీ జలాల ఒప్పందాన్ని భారత్ నిలుపుదల చేయడాన్ని మేం అంగీకరించం. సంకుచిత రాజకీయ ప్రయోజనాల కోసమే భారత్ ఇదంతా చేస్తోంది. దీనివల్ల లక్షలాది మంది ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయి. భారతదేశం రెడ్ లైన్‌ను దాటడాన్ని మేం సహించం’ అంటూ వ్యాఖ్యలు చేశారు.

అనంతరం, పాకిస్తాన్‌కు భారత పర్యావరణ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ స్ట్రాంగ్‌ కౌంటరిచ్చారు. ఈ సందర్బంగా కీర్తి వర్థన్‌ ప్రసంగిస్తూ.. సింధూ నదీ జలాల ఒప్పందంపై భారత్, పాక్ సంతకం చేసిన తర్వాత పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చాయి. పాకిస్తానే ఉగ్రవాద కార్యకలాపాల ద్వారా సింధూ నదీ జలాల ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది. తానే తప్పు చేస్తూ భారత్‌‌ను పాక్ నిందించడం సరికాదు. ఈ సదస్సు వేదికను దుర్వినియోగం చేయడానికి, దీని పరిధిలోకి రాని అంశాలను ప్రస్తావించడానికి పాకిస్తాన్ చేసిన ప్రయత్నాన్ని ఖండిస్తున్నాను. సింధూ నదీ ఒప్పందపు నియమ నిబంధనలను పునఃసమీక్షించాల్సిన అవసరం ఉంది. సాంకేతిక, జనాభా, పర్యావరణపరమైన అంశాల్లో మార్పులు జరగాలని డిమాండ్‌ చేస్తున్నాను. పాక్ సీమాంతర ఉగ్రవాదంపైనా చర్చ జరగాలన్నారు. సద్భావన, స్నేహ స్ఫూర్తితో కుదిరిన ఈ ఒప్పందం అమలుకు ఉగ్రవాదంతో పాకిస్తాన్ ఆటంకం కలిగిస్తోంది.

హిమాలయ ప్రాంతంలోని హిమానీనదాల పరిరక్షణకు భారత్‌ కట్టుబడి ఉంది. హిమానీనదాలు కరిగిపోతుండటం అనేది ఒక హెచ్చరిక మాత్రమే కాదు. ఈ వైపరీత్యం వల్ల జల భద్రత, జీవవైవిధ్యం, వందల కోట్ల ప్రజల జీవనోపాధి ప్రశ్నార్ధకంగా మారుతాయి. పర్యావరణ పరిరక్షణతో భూతాపాన్ని తగ్గించడంపై కుదిరిన పారిస్ ఒప్పందంలో భారత్ అంగీకరించిన నేషనల్లీ డిటర్‌మైండ్ కంట్రిబ్యూషన్స్ (NDCs)ను సాధించే దిశగా మోదీ సర్కారు గణనీయమైన పురోగతిని సాధించామం’ అని వెల్లడించారు. 

Videos

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)