Breaking News

భారత్‌లో తొలి మంకీపాక్స్‌ ‘క్లేడ్‌ 1బీ’ కేసు నమోదు

Published on Mon, 09/23/2024 - 18:48

న్యూఢిల్లీ: అనేక దేశాల్లో వేగంగా విస్తరిస్తున్న ప్రాణాంతక మంకీపాక్స్‌కు సంబంధించి భారత్‌లో మరో కేసు నమోదైంది. కేరళకు చెందిన వ్యక్తికి మంకీపాక్స్‌ క్లేడ్‌ 1బీ వేరియంట్‌ నిర్ధారణ అయినట్లు కేంద్ర ప్రభుత్వం సోమవారం పేర్కొంది. కాగా ఈ రకం కేసు దేశంలో నమోదవ్వడం ఇదే తొలిసారి.  గతవారం కేరళలోని మలప్పురం జిల్లాకు చెందిన వ్యక్తికి క్లేడ్‌ 1బీ వేరియంట్‌ సోకినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రతినిధి మనీషా వర్మ తెలిపారు. 

కేరళకు చెందిన 38 ఏళ్ల వ్యక్తి యూఏఈ నుంచి ఇటీవల వచ్చాడు. అతడిలో ఎంపాక్స్‌ లక్షణాలు కనిపించడంతో వైద్య పరీక్షలు నిర్వహించగా క్లేడ్‌ 1గా నిర్ధారణ అయ్యింది. ప్రపంచ ‘ఆరోగ్య ఆత్యయిక స్థితి’కి దారితీసిన ‘క్లేడ్‌ 1బీ’ స్ట్రెయిన్‌గా దీన్ని గుర్తించారు. అయితే, ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

కాగా ప్రపంచ వ్యాప్తంగా 120కిపైగా దేశాల్లో ఎంపాక్స్‌ కేసులు వెలుగుచూశాయి. 2022 నుంచి 204 జూలై నాటికి లక్షకుపైగా కేసులు నమోదయ్యాయిఈ కేసుల్లో సగానికి పైగా ఆఫ్రికా ప్రాంతం, మరో 24శాతం అమెరికా, యూరోపియన్‌ ప్రాంతంలో 11శాతం కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర పరిస్థితి ప్రకటించింది. 
చదవండి: ప్రధానికి ‘మన్‌కీ బాత్‌’ పైనే ఎక్కువ దృష్టి: రాహుల్‌

 

Videos

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

నేపాల్ సహాయక చర్యల్లో మరో మిరాకిల్

దివ్యతేజ మృతిపై అనుమానాలు,స్టేషన్ కు వెళ్లి.. శవమై వచ్చాడా..?

డీఎస్సీ ఉద్యోగాలపై బొత్స బాంబు.. 14-15 లక్షలకు పోస్టులు అమ్ముకున్నారు..!

మీ పాదయాత్రలో పాల్గొంటే DSC ఉద్యోగాలు పంచేస్తారా?

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు