Breaking News

పాకిస్తాన్‌ ఆర్థిక దిగ్బంధం!

Published on Sat, 05/24/2025 - 03:59

న్యూఢిల్లీ: ఉగ్రవాద ఉత్పత్తి కర్మాగారంగా మారిపోయిన పాకిస్తాన్‌ మెడలు వంచాలంటే ఆ దేశానికి అప్పు పుట్టకుండా చేయాలని, ఆర్థికంగా అన్ని వైపులా దిగ్బంధించాలని భారత ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. ఉగ్రవాదులను పెంచి పోషిస్తూ భారత్‌పైకి ఉసిగొల్పుతున్న దాయాది దేశం ఆర్థికంగా మరింత చితికిపోయేలా చేయడానికి వ్యూహాలు రచిస్తోంది.

 పాకిస్తాన్‌ను మళ్లీ గ్రే లిస్టులో చేర్చాలని, కొత్తగా ఎలాంటి రుణాలు ఇవ్వకూడదని ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ఫోర్స్‌ (ఎఫ్‌ఏటీఎఫ్‌) తోపాటు ప్రపంచ బ్యాంక్‌పై ఒత్తిడి పెంచబోతున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. 

మనీ లాండరింగ్‌ నిరోధక చర్యలు చేపట్టడంలో విఫలం కావడంతోపాటు ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు అందజేస్తున్న పాకిస్తాన్‌పై కఠినంగా వ్యవహరించాలని కోరనున్నట్లు తెలిపాయి. పాక్‌ను ఎఫ్‌ఏటీఎఫ్‌ గ్రే లిస్టులో చేరిస్తే ప్రపంచ దేశాలతోపాటు అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి రుణాలు లభించే అవకాశం ఉండదు. 2018 జూన్‌లో పాక్‌ను ఈ జాబితాలో చేర్చారు. అమెరికా ప్రభుత్వ ఒత్తిడితో 2022 సెప్టెంబర్‌లో తొలగించారు. 
    
ఇటీవల అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్‌) పాకిస్తాన్‌కు ఒక బిలియన్‌ డాలర్ల బెయిల్‌ ఔట్‌ ప్యాకేజీ ఇచ్చిన సంగతి తెలిసిందే. భారత్‌ గట్టిగా వ్యతిరేకించినా సరే లెక్కచేయకుండా ఈ ప్యాకేజీ అందజేసింది. దీనివెనుక అమెరికాతోపాటు కొన్ని అరబ్‌ దేశాల ఒత్తిడి పని చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో భారత్‌ తన అసంతృప్తిని ఐఎంఎఫ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌కు తెలియజేసింది. 

అంతేకాకుండా ఈ అంశాన్ని జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్‌ ఆర్థిక శాఖ మంత్రుల దృష్టికి తీసుకెళ్లింది. పాకిస్తాన్‌ ఆర్థికంగా ఎప్పుడో దివాలా తీసింది. విదేశీ రుణాలు, బెయిల్‌ఔట్‌ ప్యాకేజీలతోనే బతుకు బండి లాగిస్తోంది. పాకిస్తాన్‌కు వచ్చే నెలలో 20 బిలియన్‌ డాలర్ల రుణం మంజూరు చేసేందుకు ప్రపంచ బ్యాంకు ఇప్పటికే అంగీకరించినట్లు సమాచారం. ఈ రుణాన్ని నిలిపివేసేలా ప్రపంచ బ్యాంక్‌ను విజ్ఞప్తి చేయాలని భారత్‌ నిర్ణయించింది. 
 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)