Breaking News

రాష్ట్రపతి పాలన తొలిగా ఏ రాష్ట్రంలో ఎందుకు విధించారు?

Published on Sat, 02/15/2025 - 11:58

ఇంఫాల్‌: మణిపూర్‌లో గురువారం(ఫిబ్రవరి 15) నుంచి రాష్ట్రపతి పాలన విధించారు. దీనికిముందు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు.  ఈ నేపధ్యంలో రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి నెలకొంది. మణిపూర్‌లో అధికార భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కొత్త నేత విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోనందున రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించారు. దేశంలో ఎటువంటి పరిస్థితుల్లో రాష్ట్రపతి పాలన విధిస్తారనే విషయానికొస్తే..

రాజ్యాంగాన్ని అమలు చేసే యంత్రాంగం విఫలమైనప్పుడు ఏ రాష్ట్రంలోనైనా రాష్ట్రపతి పాలన(President's rule) విధించవచ్చని రాజ్యాంగంలోని ఆర్టికల్ 356 చెబుతోంది. అలాగే ఆర్టికల్ 356 ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్ర ప్రభుత్వాన్నయినా తొలగించి, ఆ రాష్ట్రాన్ని తన ఆధీనంలోకి తీసుకునే  అవకాశం ఉంది. రాష్ట్రపతి పాలన విధించడానికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగం ప్రకారం పరిపాలించలేని స్థితిలో ఉన్నప్పుడు లేదా ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సూచనలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైనప్పుడు కేంద్రం ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించేందుకు అవకాశం ఉంది. 1950లో రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత నుంచి కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 356(Article 356)ను ఉపయోగిస్తూ వస్తోంది.

దేశ మొదటి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ 1951 జూన్ 20న పంజాబ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తొలిసారిగా ఆర్టికల్ 356ను ఉపయోగించారు. ఆయన పంజాబ్ కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని రద్దు చేసి, రాష్ట్రపతి పాలన విధించారు. నాడు పంజాబ్ కమ్యూనిస్ట్ ప్రభుత్వం(Communist government)లో నెలకొన్న అంతర్గత విభేదాలను పరిష్కరించడానికే ఆ రాష్ట్రంలో రాష్ట్రపతిని విధించారని కొందరు రాజకీయ నిపుణులు చెబుతుంటారు.  కాగా అధికారిక రికార్డుల ప్రకారం 1959లో మొదటిసారిగా కేరళలో ఎన్నికైన కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని ఆర్టికల్ 356 ఉపయోగించి రాష్ట్రపతి పాలన విధించారు. జవహర్‌లాల్ నెహ్రూకు కేరళ వామపక్ష ప్రభుత్వం నచ్చకపోవడమే దీనికి ప్రధాన కారణమనే ఆరోపణలున్నాయి. 

ఇది కూడా చదవండి: బీపీకి ఆయుర్వేద ఔషధం.. త్వరలో అందుబాటులోకి..

Videos

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినానో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)