Breaking News

అమెరికాకు అన్ని రకాల పోస్టల్‌ సేవలు బంద్‌ 

Published on Mon, 09/01/2025 - 05:23

న్యూఢిల్లీ: అమెరికా కస్టమ్స్‌ శాఖ తాజాగా ప్రకటించిన నిబంధనల్లో స్పష్టత లేకపోవడంతో అన్ని రకాల పోస్టల్‌ సేవలను నిలిపివేస్తున్నట్లు ఇండియా పోస్ట్‌ ప్రకటించింది. 100 డాలర్లకంటే ఎక్కువ విలువైన బహుమతులను అమెరికా భూభాగంలోకి డెలివరీ చేసేందుకు తొలుత ఇండియాపోస్ట్‌ తాత్కాలిక విరామం ఇవ్వగా తాజాగా అన్ని కేటగిరీల పార్శిళ్లను అమెరికాకు డెలివరీ చేయడం ఆపేసింది. ‘‘ఆగస్ట్‌ 22న జారీచేసిన బహిరంగ నోటీస్‌ ప్రకారమే అమెరికాకు పార్శిళ్ల డెలివరీను ఆపేశాం. 

అయితే అమెరికా కస్టమ్స్‌ శాఖ విడుదలచేసిన తాజా నిబంధనల్లో స్పష్టత కొరవడింది. ఇలాంటి అస్పష్ట పరిస్థితుల్లో అమెరికాకు లేఖలు, డాక్యుమెంట్లు, బహుమతుల వంటి ఎలాంటి వస్తువులను పంపడం సమర్థనీయం కాదు. అందుకే అన్నిరకాల పార్శిళ్లను అమెరికాకు పంపడం నిలిపేస్తున్నాం. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాం. అమెరికా విభాగాల స్పందనకు అనుగుణంగా వీలైనంత వరకు త్వరగా సేవల పునరుద్ధరణకు కట్టుబడిఉన్నాం’’అని ఇండియాపోస్ట్‌ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంది.  

Videos

సాక్షి ఇన్వెస్టిగేషన్ లో సంచలన విషయాలు.. DSC అక్రమాలపై తిరుగులేని సాక్ష్యాలు

అమెరికా యుద్ధ నౌకలపై ఇరాన్ క్షిపణి దాడులు

ACల దొంగలు.. వైరల్ అవుతున్న వీడియో

ధురంధర్ డైరెక్టర్ తో టాక్సిక్ హీరో.. పాన్ ఇండియా షేక్ చేసే కాంబో?

శ్రీ చరణి దెబ్బ అదుర్స్! 55 పరుగులకే పాక్ ఆలౌట్..

టీచర్ ఉద్యోగం కోసం 12 లక్షలు అడిగారు.. లోకేష్ మనుషులు వచ్చి మాట్లాడుతారు అంటూ..

SBI గుడ్ న్యూస్.. రూ.15 లక్షల స్కాలర్ షిప్!

10 రోజులుగా శిథిలాల కింద.. చివరకు ప్రాణాలతో బయటకు..!

DSCలో స్కాం జరగకపోతే CBI విచారణకు సిద్ధమా..?

పుట్టలో పాముల్లా బయటికొస్తున్న DSC అక్రమాలు

Photos

+5

‘కామ్రేడ్‌ కళ్యాణ్‌’ టీజర్‌ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ట్రెండింగ్‌లో సీరియల్ బ్యూటీ.. బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ (ఫొటోలు)

+5

చెన్నైలో నా రోజు ఇలా గడిచింది (ఫొటోలు)

+5

అగ్నిపరీక్షలో గెలిచి 'బిగ్‌బాస్' 10లోకి రైతుబిడ్డ ఎంట్రీ (ఫొటోలు)

+5

దేవకన్యలా 'మ్యాడ్' ఫేమ్ అనంతిక (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘రన్ ఫర్ నేచర్'(ఫొటోలు)

+5

పింక్ బ్యూటీ ప్రియాంక మోహన్ (ఫొటోలు)

+5

'మారెమ్మ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)