Breaking News

ఉప ఎన్నికల్లో ఇండియా కూటమి జోరు

Published on Sun, 07/14/2024 - 04:53

న్యూఢిల్లీ: ఏడు రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఇండియా కూటమి పార్టీలు ఆధిక్యాన్ని కనబర్చాయి. విపక్ష ఇండియా కూటమి పారీ్టలైన కాంగ్రెస్, తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ), డీఎంకే, ఆప్‌లు పది అసెంబ్లీ సీట్లను గెల్చుకున్నాయి. బీజేపీ రెండు స్థానాలతో సరిపెట్టుకోగా, ఒకచోట స్వతంత్ర అభ్యర్థి నెగ్గారు. పశ్చిమబెంగాల్‌లోని నాలుగు, హిమాచల్‌ ప్రదేశ్‌లోని మూడు, ఉత్తరాఖండ్‌లోని రెండు, పంజాబ్, మధ్యప్రదేశ్, బిహార్, తమిళనాడు రాష్ట్రాల్లో ఒక్కో స్థానానికి బుధవారం ఉప ఎన్నికలు జరగ్గా.. శనివారం ఓట్ల లెక్కింపు చేపట్టారు. 

ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో 42 స్థానాలకుగాను 29 చోట్ల నెగ్గి బెంగాల్‌లో తనకు తిరుగులేదని నిరూపించుకున్న సీఎం మమతా బెనర్జీ సారథ్యంలోని టీఎంసీ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో నాలుగింటికి నాలుగు స్థానాలను తమ ఖాతాలో వేసుకుంది. వీటిలో మూడు బీజేపీ సిట్టింగ్‌ స్థానాలు కావడం విశేషం. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి ఆధిక్యం వచి్చన చోట్ల కూడా అసెంబ్లీ ఉప ఎన్నికల్లో టీఎంసీ జయకేతనం ఎగురవేసింది. 294 మంది సభ్యులున్న పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీలో టీఎంసీ బలం 215కు చేరింది.  

అసెంబ్లీలో భార్యాభర్తలు 
హిమాచల్‌ ప్రదేశ్‌లో ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు రాజీనామా చేసి.. బీజేపీ టికెట్‌పై పోటీచేశారు. వీరిలో ఇద్దరు ఓటమి పాలుకాగా.. ఒక్కరు గెలుపొందారు. అందరి దృష్టిని ఆకర్షించిన డేహ్రా నియోజకవర్గంలో హిమాచల్‌ సీఎం సుఖ్విందర్‌ సింగ్‌ సుఖు సతీమణి కమలేష్‌ ఠాకూర్‌ విజయం సాధించారు. ఇక్కడ కాంగ్రెస్‌ అధిష్టానం పట్టుబట్టి మరీ కమలే‹Ùను రంగంలోకి దింపింది. హిమాచల్‌ అసెంబ్లీలో ఇకపై భార్యాభర్తలు సుఖ్విందర్, కమలే‹Ùలు కనిపించనున్నారు. 

తాజాగా ఇద్దరి గెలుపుతో 68 మంది సభ్యులున్న అసెంబ్లీలో కాంగ్రెస్‌ బలం 40కి చేరింది. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 40 సీట్లు నెగ్గి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే రాజ్యసభ ఎన్నికల్లో ఏకంగా ఆరుగురు ఎమ్మెల్యేలు క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడి బీజేపీకి ఓటేయడంతో కాంగ్రెస్‌ బలం 34కు పడిపోయింది. సుఖు ప్రభుత్వాన్ని అస్థిరత వెంటాడింది. లోక్‌సభ ఎన్నికలతో పాటే 6 స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ నాలుగు నెగ్గింది. ఇప్పుడు మరో రెండు స్థానాలు గెలవడంతో కాంగ్రెస్‌ బలం మళ్లీ 40కి చేరింది. 

బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరాఖండ్‌లో రెండు స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. రెండింటినీ కాంగ్రెస్‌ కైవసం చేసుకుంది. ఇందులో ఒకటి కాంగ్రెస్‌ సిట్టింగ్‌ స్థానం.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)