Breaking News

యుద్దానికి బ్రేక్!.. స్పందించిన జమ్మూ కాశ్మీర్ సీఎం

Published on Sat, 05/10/2025 - 19:59

భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్వాగతించారు. అమాయక ప్రజల ప్రాణాలు పోకుండా ఉండటానికి ఇది ముందుగానే వచ్చి ఉంటే బాగుండేదని విచారం వ్యక్తం చేశారు. కాగా ఇప్పటికే పాక్ కాల్పుల వల్ల చనిపోయిన కుటుంబాలకు రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియాను ఒమర్ అబ్దుల్లా ప్రకటించారు.

గత నాలుగు రోజుల్లో పూంచ్, రాజౌరి, జమ్మూ, బారాముల్లా సెక్టార్లలో 19 మంది గ్రామస్తులు మరణించారు. బుధవారం పూంచ్‌లో 12 మంది పౌరులు మరణించగా.. శుక్రవారం ఉరి, పూంచ్‌లో మరో ఇద్దరు మరణించారు. శనివారం ఉదయం పాకిస్తాన్ కాల్పుల్లో ఒక సీనియర్ ప్రభుత్వ అధికారితో సహా మరో ఐదుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు.

ఘర్షణ సమయంలో జరిగిన అగ్నిప్రమాదాల వల్ల జరిగిన విస్తృతమైన నష్టాన్ని ఎత్తిచూపుతూ, నష్ట అంచనాలను ఖరారు చేయవలసిన ఆవశ్యకతను అబ్దుల్లా నొక్కి చెప్పారు. ప్రభావిత కుటుంబాలకు సహాయం అందించడం ప్రారంభించడానికి వీలుగా వెంటనే తుది సర్వేలు నిర్వహించి నివేదికలు పంపాలని డీసీలకు ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. అంతే కాకుండా మా విమానాశ్రయం చాలా రోజులుగా మూసివేయడం జరిగింది. కాల్పుల విరమణ తర్వాత అది తిరిగి ప్రారంభమవుతుందని మేము ఆశిస్తున్నామని ఆయన అన్నారు.

కాల్పుల విరమణ
భారత్, పాకిస్తాన్ కాల్పుల విరమణకు అంగీకరించినట్లు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ అధికారికంగా పేర్కొన్నారు. సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విమరణ అమలులోకి వచ్చినట్లు ఆయన వెల్లడించారు. ఈ రోజు మధ్యాహ్నం 3.35 గంటలకు పాక్ DGMO.. భారత్ DGMOకు ఫోన్ చేసి కాల్పులు విమరణ చేయాలని కోరినట్లు మిస్రీ పేర్కొన్నారు. పాకిస్తాన్ అభ్యర్థనతో.. భారత్ కాల్పుల విరమణకు అంగీకరించినట్లు చెప్పారు. కాగా ఎల్లుండి (సోమవారం, మే 12) మధ్యాహ్నం 12 గంటలకు ఇరుదేశాల మిలటరీ జనరల్స్ మధ్య చర్చలు జరుగుతాయని ప్రకటించారు.

#

Tags : 1

Videos

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)