Breaking News

అంతర్జాతీయ ఆవాసం!

Published on Sat, 03/01/2025 - 06:46

అవును. ఈ బుల్లి ఇల్లు నిజంగానే రెండు దేశాల పరిధిలో విస్తరించింది! ఈ గమ్మత్తైన ఇల్లు ఈశాన్య రాష్ట్రమైన నాగాలాండ్‌లోని లోంగ్వా గ్రామంలో ఉంది. ఇది కాస్త భారత్‌లో, మిగతా భాగం మయన్మార్‌ పరిధిలో ఉంటుంది! భారత్, మయన్మార్‌ సరిహద్దు సరిగ్గా ఈ గ్రామం నడుమగా పోవడమే దీనికి కారణం. ప్రధాన ద్వారానికి ఆ పక్క సగంపై నాగాలాండ్‌ (భారత్‌), ఈ పక్క సగంపై సగాయింగ్‌ (మయన్మార్‌) అని రాసి ఉంటుంది కూడా. 

ఇంటి బయట ఠీవిగా నుంచున్నది దాని యజమాని టోనెయ్‌ ప్వాంగ్‌. అన్నట్టూ, ఆయన స్థానిక కోన్యాక్‌ నాగా గిరిజన తెగ నాయకుడు కూడా. ఆరకంగా చూస్తే ఆయన నివాసం లోంగ్వా గ్రామం మొత్తానికీ రాజప్రాసాదం వంటిదన్నమాట. ఈ ఇంటికి 100 ఏళ్ల పై చిలుకు చరిత్ర ఉంది. అంతర్జాతీయ సరిహద్దు మాత్రం 1971లో పుట్టుకొచ్చింది. ప్వాంగ్‌ ఇంటిని రెండు దేశాలకూ చెందేలా విడదీసింది. 

‘‘అంతర్జాతీయ సరిహద్దు 50 ఏళ్ల కింద పుట్టుకొచ్చింది. మా ఇల్లు అంతకు 50 ఏళ్ల ముందునుంచే ఉంది. సరిహద్దు భూభాగాన్ని విభజిస్తుందేమో గానీ ఇది మా పూరీ్వకుల ఆవాసం. ఇందులో ఉండేందుకు మాకు ఎలాంటి ఇబ్బందీ ఎదురవడం లేదు’’ అంటారు ప్వాంగ్‌. ఈ ఊళ్లోని వాళ్లంతా భారతీయులే. అందరికీ ఓటు హక్కు కూడా ఉంది. అయినా వారికి మయన్మార్‌ నుంచి పలు సంక్షేమ పథకాలు అందుతుండటం విశేషం! ఈ ఊళ్లో రెండు దేశాల సైన్యాలూ గస్తీ కాస్తుంటాయి. అంతేకాదు. ఈ ప్రాంతంలో భారత్, మయన్మార్‌ ప్రజలు వీసా తదితరాలేవీ అవసరం లేదు.

Videos

AP: దారుణంగా పెరిగిపోతున్న హత్యలు నెల్లూరులో ఏం జరిగిందంటే..

సంచలనం రేపుతున్న డ్యాన్సర్స్ యూనియన్ వివాదం

అంబానీపై SBI కేసు.. అసలు కారణం ఇదే!

నేను తప్పు చేయలేదు కన్నీరు పెట్టుకున్న కవిత.. ఎందుకంటే..!

కోడిగుడ్లు, టమాటాలతో కోమటిరెడ్డి కార్యాలయంపై దాడి

Nepal Flood: చావు అంచున ప్రాణాలు కాపాడిన అసలైన హీరో!

నీ చరిత్ర మొత్తం బయట పెడితే.. మొహం ఎక్కడ పెట్టుకుంటావో తెలుసా..

బాబుకు ఏపీ కంటే తెలంగాణ అంటేనే ప్రేమ ఎక్కువ..!

ద్రౌపది ముర్ము ADC 'నేషనల్ క్రష్' రిషబ్ సింగ్ రాజీనామా

ఏపీలో మందు బాబులకు బిగ్ షాక్

Photos

+5

రోమాంచకం హీరోయిన్ అనంతిక గ్లామరస్ లుక్స్.. ఫోటోలు

+5

అమెరికా ట్రిప్‌లో బుట్టబొమ్మ పూజా హెగ్డే చిల్.. ఫోటోలు

+5

'ఇరుముడి'లో చీరతో.. ఇప్పుడేమో స్టైలిష్‌గా (ఫొటోలు)

+5

పెళ్లి పీటలెక్కనున్న కొత్త జంట (ఫొటోలు)

+5

చెల్లితో కలిసి ప్రకృతి ఒడిలో 'ప్రేమమ్' హీరోయిన్ (ఫొటోలు)

+5

ఈ టాలీవుడ్ హీరోయిన్ గుర్తుందా? బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

ట్రెండింగ్‌లో 'రద్ధిమా' సాంగ్.. సాయి-భాగ్యశ్రీ కెమిస్ట్రీ (ఫొటోలు)

+5

వెలిగొండకు జగన్‌ అప్పుడే.. క్రెడిట్‌ ఎవరిదో ఈ ఫొటోలు చూస్తే క్లారిటీ!

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఆగస్టు 30- సెప్టెంబర్ 05)

+5

కొత్తింట్లోకి అడుగు పెట్టిన హీరోయిన్.. గృహప్రవేశం (ఫొటోలు)